సీమాంధ్ర, తెలంగాణలు 30-10-2014న  రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న తరుణంలో  ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారనేది చర్చనీయాంశమయింది. అపాయింటెడ్ డే సందర్భంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. మరి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు అనేది అటు రాజకీయ నేతల్లోనూ, ఇటు సీమాంధ్ర ప్రజల్లోనూ సందిగ్ధత నెలకొంది. కాగా, ఈ విషయంపై  అధికారిక, రాజకీయ వర్గాలన్నింటిలో చర్చలు జరిగాయి.


అక్టోబర్ 1, 1953లో మద్రాసు నుంచి రాష్ట్రం విడిపోయి, హైదరాబాద్ రాష్ట్రమైన తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 1856, నవంబర్ ఒకటో తేదీన ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1 తారీఖున చేయాలని నిర్ణయించారు. 
గతంలో బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు మాత్రం కొత్త తేదీన అవతరణ ఉత్సవాలను నిర్వహిస్తున్నాయని తెలిపింది. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తొలుత ఏర్పాటైన తేదీల్లోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నాయని స్పష్టంచేసింది.


అయితే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది అక్టోబరు 1నే కాబట్టి అదే రాష్ట్రం ఈ రోజున ఇక పైన అలా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని అక్టోబరు 1న చేసుకోవాలి కొంత మంది అంటున్నారు.  జూన్‌ 8న కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఆంధ్రరాష్ట్రం తిరిగి ఈ రోజే అధికారంలోనికి వచ్చింది. కాబట్టి నేటి ఆంధ్రప్రదేశ్‌ దాని అవతరణ దినోత్సవాన్ని జూన్‌ 8న జరుపుకోవాలని కొందరు భావిస్తున్నారు. కాని మరికొందరు ప్రజాప్రభుత్వం లేకున్నా రాష్ట్రం విడిపోయి ఏర్పడిన రోజు జూన్‌ 2 కాబట్టి ఆ రోజు జరుపుకోవాలి అని భావిస్తున్నారు.


తెలంగాణ విడిపోయినప్పటికీ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడిన నేపథ్యంలో నవంబర్ 1న జరపాలని నిర్ణయం తీసుకున్నారు.  తెలంగాణ రాష్ట్రం మాత్రం జూన్ 2న అవతరణ ఉత్సవాలను నిర్వహిస్తుందని పేర్కొంది. కాకపోతే ఇప్పటి ప్రభుత్వం నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాలను నిర్వహించలేదు. మరోవైపు అవతరణ దినోత్సవాలను నవంబర్ 1వ తేదీనే నిర్వహించాలని కేంద్రం చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: