ఈ కొత్త తరానికి తెలంగాణా అవతరణ , తెలంగాణా కి సంబంధించిన పోరాటం గురించి ఐతే తెలుసు కానీ ఆంధ్ర ప్రదేష్ అవతరణ గురించి పెద్దగా తెలీదు చాలా మందికి. తెలంగాణా ఉద్యమం లో ఎందరో చనిపోయారు .. ఎవ్వరి గురించీ ఇప్పుడొచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు - ఆ కుటుంబాలని సరిగ్గా ఆదుకోలేదు అనే మాటలు వినపడుతూ ఉంటాయి. కెసిఆర్, కోదండరాం ఇలా ఎందరో తెలంగాణా కోసం పోరాడినా తెలంగాణా వచ్చింది మాత్రం రాజకీయ చరిత్రలో భాగంగా తప్ప పోరాటాల సమాహారం కాదు అనేది ఒక వాదన.
Related image
కానీ ఆంధ్ర ప్రదేశ్ యొక్క ప్రత్యేక రాష్ట్ర పోరాటం మాత్రం చాలా గొప్పది. ఆ పోరాటం లో ఒక గొప్ప వ్యక్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కోల్పోయారు. ఆయనే అమర జీవి పొట్టి శ్రీరాములు ఆయన ఆత్మార్పణం ఫలితంగా అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం విలీనమై నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది..
Related image
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో జూన్ 2, 2014న రాష్ట్రం రెండుగా విడిపోయింది.. తెలంగాణ మినహా మిగతా ప్రాంతం ఆంధ్రప్రదేశ్ పేరుతోనే కొనసాగుతోంది.. తెలంగాణ విషయానికి వచ్చే సరికి జూన్ 2 అవతరణ దినోత్సవం.. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైతం ఇదే తేదీ జరపవచ్చా అన్నదే సందిగ్దం.గా మారింది. ఏదేమైనా ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం తెలుగువాళ్ళకి అత్యవసరం గా మారిన రోజుల్లో పొట్టి శ్రీరాములు చాలా డెడికేషన్ తో పోరాడారు అనేది ఇప్పటికీ జనాలు చెప్పుకునే మాట.
Related image
రాజకీయం , చైతన్యం ఇవన్నీ తక్కువగా ఉన్న రోజుల్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రము ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచన తో ఆయన అమరజీవి అయ్యి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి , తెలుగువాళ్ళ కీ ఒక గొప్ప కలని సాకారం చేసారు ఆయన. ఒక్క సారి ఊహించుకోండి మనం అందరం ఇంకా తమిళ రాష్ట్రం లో నే కొనసాగుతూ ఉంటే ఉండే పరిస్థితి , వచ్చే విపత్కర పరిస్థితులు  ఎలా ఉండేవో.అందుకే ప్రతీ సంవత్సరం నవంబర్ రెండు న పొట్టి శ్రీరాములు ని స్మరించుకుందాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: