Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 10:13 pm IST

Menu &Sections

Search

ఆంధ్రరాష్టం కోసం..‘పొట్టి శ్రీరాములు’ ఆత్మార్పణం!

ఆంధ్రరాష్టం కోసం..‘పొట్టి శ్రీరాములు’ ఆత్మార్పణం!
ఆంధ్రరాష్టం కోసం..‘పొట్టి శ్రీరాములు’ ఆత్మార్పణం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారతదేశం బ్రిటీష్ కబంధ హస్తాల నుంచి స్వాతంత్రం లభించిన అనంతరం.. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘం తరఫున నిర్మాణ కార్యక్రమ ఆర్గనైజరుగా శ్రీరాములు పనిచేశారు. ఈ నేపథ్యంలో.. ఆంద్రులకు ప్రత్యేకంగా రాష్ట్రం లేకపోవటం వల్ల నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించటంలో ఎన్నో ఇబ్బందులు అనుభవించాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో ఏ పని జరగాలన్నా రాష్ట్రం లేకపోతే సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు.  మహాత్మా గాంధీతో పాటు దాదాపు రెండు దశాబ్దాలు గడిపారు శ్రీరాములు. ఆయన అహింస సిద్ధాంతాన్ని బాగా విశ్వసించి, పలుమార్లు ఆచరించి.. విజయం సాధించారు. అదే మార్గంలో దీక్ష చేయాలని నిర్ణయించారు.  పొట్టి శ్రీరాములు గాంధేయవాది.

andhrapradesh-formation-day-andhrapradesh-potti-sr

సర్వోదయ ఉద్యమ ప్రముఖుడు, మహనీయుడు సందేహం లేదు. గాంధేయ కార్యక్రమాల్లో శ్రీరాములు అంకిత భావంతో పాల్గొన్నారు.  ఒక లక్ష్యాన్ని సాధించడానికోసం ఆయన మద్రాసు నగరంలో (పొట్టి శ్రీరాములు1901 మార్చి 16న మద్రా సు నగరంలో జన్మించారు) 1952 అక్టోబర్ 19నుంచి డిసెంబర్15 వరకు 57 రోజులు ఆమరణ నిరాహారదీక్ష జరిపి చివరికి ప్రాణ త్యాగం చేశారు. 1952 అక్టోబరు 19వ తేదీన తన దీక్ష ప్రారంభించడానికి ముందు పత్రికలకు శ్రీరాములు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో.. ‘‘మద్రాసు నగర భవిష్యత్తు విషయమై మద్రాసు పౌరుల్లో ఏకాభిప్రాయం సాధించడానికి తీవ్రమైన కృషి జరగాలి’’ అని పేర్కొన్నారు. 


andhrapradesh-formation-day-andhrapradesh-potti-sr

దీక్షా కాలంలో శ్రీరాములు పాటించిన దిన చర్యను డాక్టర్ కస్తూరి నారాయణ మూర్తి, డాక్టర్ అవధాని, డాక్టర్ శాస్త్రి తదితరులు పర్యవేక్షించేవారు. గాంధీజీ తన నిరశన వ్రతాల్లో పాటించిన నియమాలనే ఇంచుమించు శ్రీరాములు కూడా అనుసరించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు ముందు శ్రీరాములు ఐదు సార్లు నిరాహార దీక్షలు చేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితం.. మద్రాసు లేకుండా ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబర్ 19వ తేదీన లోక్‌సభలో ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించారు.ఈ మేరకు వాంఛూ కమిటీని ఏర్పాటు చేశారు. 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 


2008 మే 22వ తేదీన నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  చరిత్రలో ఎంతో మంది మహనీయులు ఉన్నారు..ఇలాంటి త్యాగాలు చేసిన వారు మాత్రం చాలా అరుదుగా ఉన్నారు..అలాంటి వారిలో పొట్టి శ్రీరాములు త్యాగం ఎప్పటికీ మరువలేనిది.

andhrapradesh-formation-day-andhrapradesh-potti-sr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ