ప్రతి మనిషికి ఒక పుట్టిన తేదీ ఉంటుంది. అలాగే సంస్థకు, పార్టీలకు కూడా ఉంటాయి. అటువంటిది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి మాత్రం ఆవిర్భావ దినం లేదు. ఇలా నాలుగేళ్ళు గడచిపోయాయి. దేశంలోని 28 రాష్ట్రాలు ఘనంగా పండుగలు చేసుకుంటే ఏపీ మాత్రం ఏమీ లేకుండా మిన్నకుంటోంది.  దీని వెనక రాజకీయమేంటి.


అరవయ్యేళ్ళు నలిగిన తేదీ:


నవంబర్ ఫస్ట్. ఈ తేదీ వినగానే కలలో కూడా చెప్పేస్తాం, ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం అని క్యాలండర్లలో ఇప్పటికీ అదే రాస్తున్నారు. ఒక ఏడాది కాదు. ఏకంగా అరవయ్యేళ్ళుగా సాగుతూ వస్తున్న సంప్రదాయం. ఇపుడు అంత తేలిగ్గా మరచిపొమ్మంటే తెలుగు వాడెవడూ అంత  మరువలేడు. 1956లో నిజం స్టేట్. అప్పటి ఆంధ్ర రాష్ట్రం కలసి ఉమ్మడి  ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడ్డాయి. ఫలితంగా నవంబర్ 1 నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం  జరుపుకోవడం ఆచారమైంది.


రాజకీయమే కారణమా:


ఇక 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. అదే రోజుని తెలంగాణా ఆవిభావ దినోత్సవంగా జరుపుకుంటోంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ మాత్రం ఇంతవరకూ ఫలాన తేదీ ఆవిర్భావం అని నిర్ణయించుకోలేదు. దీనిపై అనేక వాదనలు ఉన్నాయి. రాజకీయలు ఉన్నాయి. చివరకు నాలుగేళ్ళుగా ఏపీ పుట్టిన తేదీని మాత్రం ఎవరూ నిర్ణయించలేకపోయారు.దీని వెనక ఓట్ల రాజకీయం దాగుందని అంటారు.


వారు హర్ట్ అవకూడదట :


తెలంగాణాలో కూడా తన పార్టీ ఉండాలని ఇక్కడ రూలింగ్ లో ఉన్న టీడీపీ కోరుకుంది. అందువల్లనే ఏపీకి ప్రత్యేకమైన రోజు అంటూ పెట్టలేదని ప్రతిపక్షాల వాదన. ముక్కగా ఉన్న ఏపీకి జూన్ 2న ఆవిర్భావ దినం అంటే ఏపీ ప్రజలు ఒప్పుకోరు. అడ్డగోలు  విభజన వారికి గుర్తుకువస్తుంది. మరో రోజు పెట్టేందుకు ఏపీ సర్కార్ ఎందుకు వెనకాడుతుందో అర్ధం కాదు.


నిజానికి 1953 అక్టోబర్ ఫస్ట్ న ఆంధ్ర రాష్ట్రం కర్నూల్ రాజధానిగా ఏర్పడింది. ఆ రోజుని ప్రకటించాలని విడిపోయిన తరువాత అంతా కోరారు. లేకపోతే నవంబర్ ఫస్ట్ అయినా ఉంచాలని కోరారు. ఈ రెండూ కాదనుకున్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014 జూన్ 8న ప్రమాణం చేసిన రోజు అయినా ఉంచాలని కోరారు. దేనికీ తలవొగ్గని ఏపీ సర్కార్ కేవలం జూన్ 2 నుంచి 9 వరకు ప్రతీ ఏటా సంకల్ప దినాలు అంటూ నిర్వహిస్తూ రాజకీయం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అంధ్రులకు ఒక ఆవిర్భావ దినం కావాలి అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: