తెలుగువారికి ఒక రాష్ట్రం ఉండాలని స్వాతంత్రానికి ముందే ఒక ఆలొచన పురుడు పోసుకుంది. దానికి అప్పట్లో అనేకమంది కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలిచారు. దేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణ మహాశయుడు కూడా తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని కోరుకున్నారు. ఇక దేశ మాత స్వేచ్చ కోసం ఓ వైపు సాగుతున్న పోరాటానికి సమాంతరంగా తెలుగు వారు రాష్ట్రం కోసం ఉధ్యమించారు. దీనికి పూజ్య బాపూజీ కూడా సమ్మతం తెలపడమే కాదు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పెట్టి తీర్మానం పాస్ చేయించారు.


వర్గ పోరుతో వెనక్కు :


అప్పటి కాంగ్రెస్ నాయకుల మధ్యన విభేదాలు కారణంగా ఎపుడో రావాల్సిన రాష్ట్రం దశాబ్దాల పటు వెనక్కు పోయింది. చివరకు అందరికీ ఏకత్రాటిపైకి తెస్తూ కాంగ్రెస్ నాయకుడు పొట్టి శ్రీరాములు అమరణనిరాహార దీక్ష చెపట్టారు. ఆయన మద్రాస్ లో మహర్షి బులుసు రామ్మూర్తి ఇంట్లో అక్టోబర్ 19వ తేదీ 1952న పూర్తి ఉపవాసంతో దీక్షకు కూర్చున్నారు. అలా యాభై ఎనిమిది రోజుల పాటు ఏమీ తీసుకోకుండా అయన చేసిన దీక్ష అగ్గి పుట్టించింది ఆయన మరణంతో మద్రాస్ తో సహా ఏపీ ప్రాంతాలు అల్లకల్లోలం అయ్యాయి. ఎట్టకేలకు దిగివచ్చిన కేంద్రంలోని జవహర్లాల్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం  డిసెంబర్ 19వ తేది 1952న ప్రకటన చేసింది. అలా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆవిర్భవించింది. అప్పటి మద్రాస్ స్టేట్ నుంచి అలా అంధ్రులు విడిపోయారు.


ఏడాదికి ఏర్పాటు :


ఆ తరువాత ఏడాది అంటే 1953 అక్టోబర్  ఫస్ట్ న మద్రాస్ స్టేట్ నుంచి తెలుగు మాట్లాడే 11 జిల్లాలను వేరు చేస్తూ కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యామంత్రిగా తొలి ప్రభుత్వం ఏర్పాటు అయింది. కర్నూల్ రాజధానిగా పాలన మొదలైంది. మొదట్లో సరైన వసతులు లేకపోయినా గుడారాల్లో పాలన చేసేవారు. ఇలా మూడేళ్ళ పాటు అష్టకష్టాలు పడ్డారు.


ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ :


అప్పట్లో నిజాం స్టేట్ పేరిట హైదరాబాద్ రాజధానిగా పాలన సాగేది. ఇక్కడ కూడా తెలుగువారు ఉన్నారు. వారు మాట్లాడేదీ తెలుగే, అందువల్ల రెండు ప్రాంతాలను కలుపుకుని ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు చేయాలని నాటి పెద్దలు తలపోశారు. ఫలితంగా 1956 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రధేస్ ఏర్పాటైంది. తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ప్రమాణం చేశారు. 


నాటి నుంచి 2014 వరకూ ప్రతీ ఏటా నవంబర్ 1న ఆధ్ర రాష్ట్ర అవతరణ ఉంత్సవాలను ఘనంగా చేసుకోవడం ఆనవాయితీగా మారింది. విడిపోయిన తరువాత ఈ తేదీకి ప్రాధాన్యత పోయింది. తెలంగాణాకు ప్రత్యేకమైన తేదీ ఉంది. ఏపీకి మాత్రం ఇంతవరకూ వేరే తేదీ లేకుండా పోయింది. నవంబర్ 1 తేదీనే ఖరారు చేసి ఆంధ్రులకు ఆనదం కలిగించాలని భాషాభిమానులంతా కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: