చంద్ర బాబు కు సర్వేలు చేసుకోవడం కొత్తేమీ కాదు. తన పాలన పట్ల ప్రజలు ఎలా ఉన్నారని ఎప్పుడు సర్వేలు చేయిస్తుంటాడు. అయితే ఇప్పడూ కూడా మరో సారి సర్వే చేయించుకున్నాడు. అయితే ఇప్పుడెందుకు చేయించుకున్నాడంటే జగన్ దాడి నేపధ్యం లో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో  తెలుసుకోవడానికి అయితే జగన్ దాడి తరువాత టీడీపీ ఓటమి తో పాటు సీట్లు కూడా చాలా తక్కువ వస్తాయని రహస్య రిపోర్ట్స్ వచ్చాయంటా..  ఫలితంగా ఏపీలో కూడా కాంగ్రెస్ తో జతకట్టి ఎన్నికల బరిలో దిగుదామనుకున్న చంద్రబాబు ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. 


ఫ్లాష్ న్యూస్: చంద్ర బాబు రహస్య సర్వే... దిమ్మ తిరిగిందా...!

అంతర్గత సర్వేలు చేయించుకోవడంలో చంద్రబాబు దిట్ట. తనకు కావాల్సిన విషయానికి సంబంధించి ముందుగా లీకులు వదుల్తారు. తర్వాత దానిపై రహస్యంగా సర్వే నిర్వహించారు. ఆ వచ్చిన ఫలితాలు పాజిటివ్ గా ఉంటే అధికారిక ప్రకటన ఉంటుంది. లేదంటే ఇక ఆ టాపిక్ ను అక్కడితో వదిలేస్తారు. కాంగ్రెస్ తో పొత్తుపై కూడా ఇలానే చేశారు చంద్రబాబు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి, కాంగ్రెస్ తో జతకట్టి బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపు ఇవ్వాలని భావించారు. తద్వారా తిరిగి తను అధికారంలోకి రావాలనే ఎత్తు వేశారు.


ఫ్లాష్ న్యూస్: చంద్ర బాబు రహస్య సర్వే... దిమ్మ తిరిగిందా...!

కానీ ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీని అప్పట్లో ఎన్టీఆర్ స్థాపించారో, ఇప్పుడు అదే పార్టీతో బాబు సంసారానికి సిద్ధపడడాన్ని జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందనే కోపం ఏపీ ప్రజల్లో ఇంకా ఉంది. దీంతో కాంగ్రెస్ తో పొత్తు అంశం తనకు రివర్స్ అయ్యేలా ఉందని భావించిన బాబు వెంటనే ఆ ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: