పెను సంచలనం స్రుష్టించిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ కేసు విషయంలో అసలు నిజాలు వెలుగు చూస్తాయా. పాత్రధారి వెనక ఉన్న సూత్రధారులు బయటకు వస్తారా. అసలు దర్యాప్తు ఆ దిశగా జరుగుతుందా, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటి, కేంద్రం ఏం చేయాలనుకుంటోంది, ఇవన్నీ ఆసక్తిని కలిగించే ప్రశ్నలే.


కానరాని పురోగతి:


జగన్ పై హత్యాయత్నం జరిగి నేటికి ఆరు రోజులైంది. ఇంతవరకూ ఈ కేసులో నిందితుడు తప్ప కొత్త విషయం ఏదీ బయటకు రాలేదు. జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు ఎటూ దొరికిపోయాడు కాబట్టి పోలీసులకు పెద్దగా శ్రమ లేకుండా పోయింది కానీ , వెనక ఉన్న వారెవరో, అసలు నిందితుడు ఎందుకు ఇంతటి అఘాయిత్యానికి పూనుకున్నాడో ఇంతవరకూ పోలీసులు తేల్చలేకపోయారు. ఈ కేసుకు సంబంధిని ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల విచారణ ముగిసిన ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.


కేంద్ర దర్యాప్తు ఉంటుందా :


ఈ కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల జోక్యం కోరుతూ వైసీపీ నేతలు డిల్లీ బాట పట్టారు. టీడీపీ ప్రభుత్వం పక్క దోవ పట్టిస్తోందని, కీలకమైన కేసులో సాక్ష్యాలు లేకుండా చూస్తోందని వైసీపీ నేతలు హోం మంత్రి రాజ్ నాధ్ ద్రుష్టికి తీసుకున్వచ్చారు. ఈ కేసులో లోతైన విచారణ పారదర్శకంగా జరగాలంటే కేంద్రం జోక్యం అవసరం అని కూడా పెర్కొన్న్నారు. ఎంతవరకూ తాము చేయగలమో అది చేస్తామని హోం మంత్రి హామీ ఇచ్చినట్లుగా వైసీపీ నెతలు అంటున్నారు. అయితే ఈ కేసులో కేంద్రం వైఖరి ఏంటన్నది తెలిసిరావడంలేదు. ఒకవేళ కేంద్రం రంగంలోకి దిగితే మాత్రం బాబు తో డైరెక్ట్ ఫైట్ కి రెడీ
అవుతున్నట్లుగానే భావించాలి.


ప్రభావితం చేస్తున్నారా:


ఓ వైపు విపక్ష నాయకునిపై హత్యాయత్నం జరిగింది. సిట్ దర్యాప్త్ చేస్తోంది. మరో వైపు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నుంచి హోం మంత్రి, మంత్రులు ఇతర టీడీపీ నాయకులు ఇది జగన్ తనపై తాను చేసుకున్న దాడిగా ప్రతీ రోజూ చెబుతూ వస్తున్నారు. దర్యాప్తు  చూస్తే ఒక్క అంగుళం కూడా ముందుకు సాగడంలేదు. ఓ వైపు విచారణ జరుగుతుంటే ప్రభుత్వమే ఇలా ప్రకటలం చేయడం వల్ల కేసు పై ప్రభావం చూపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. 
మొత్తానికి ఈ కేసు ని ఎటూ కాకుండా తాము అనుకున్న రాజకీయ కోణంలోనే ముగింపు ఇచ్చేలా టీడీపీ స్కెచ్ వేస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. సిట్ పేరిట హడావుడి చేస్తున్న పోలీసులు చెష్టలుడిగి చేతులు దులుపేసుకుంటారేమోన్నన్న  సందెహాలూ వ్యక్తం  చెస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: