వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. విభజన ఏపీలో కడప జిల్లాకు చెందిన రాకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఏపీలో కీలక పార్టీని నిర్వహిస్తున్న నాయకుడు. మరి జగన్ కి ఏపీ అంటే ద్వేషమా. ఆయన ఆంధ్రులను వ్యతిరేకిస్తున్నారా. 


కొత్త ప్రచారం :


తనపై జరిగిన హత్యాయత్నం విషయంలో వాగ్మూలం ఏపీ పోలీసులకు ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. దానికి ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. అప్పటికే ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, డీజీపీ వంటి ఉన్నత స్థాయి అధికారులు జగన్ కేసుని నీరు కార్చేశారు. పోలీసులు ఎలా దర్యాప్తు చేయాలో కూడా హింట్ ఇచ్చినట్లుగా ప్రకటనలు విడుదల చేశారు. జగన్ తన మీద తానే అటాక్ చేయించుకున్నాడని, నిందితుడు వైసీపీ అభిమాని అని కూడా చెప్పడంతో జగన్ కి చిర్రెత్తుకొచ్చినట్లుంది. ఇంక దర్యాప్తు ఏమి ఉంటుందని  భావించిన జగన్ నేను వాగ్మూలం ఇవ్వను అనేశారు. దీంతో కొత్త ప్రచారం మొదలైపోయింది.


ఏపీ అంటేనే ద్వేషమట:


జగన్ చెప్పిన సందర్భం, విషయం ఇపుడు పక్కకు పోయాయి. ఇపుడు జగన్ ని ఏపీకి వ్యతిరేకంగా చిత్రీకరించే కార్యక్రమం మొదలైపోయింది. జగన్ కి ఏపీ అంటే అంత ఇష్టం లేనపుడు ఇక్కడ పాదయాత్ర ఎందుకు చేయడం అని ఒక టీడీపీ నాయకుడు అంటే, జగన్ కి ఏపీ ప్రతిపక్ష‌ నాయకుని హోదా అవసరమా అని మరో నాయకుడు అందుకుంటున్నాడు. జగన్ అంధ్రుల ద్రోహి అన్నంత వరకూ కూడా ఈ కామెంట్స్ వెళ్ళిపోయాయి. జగన్ ఇపుడు ఓ బాధితుడు. ఆయన తన కేసు విషయం చెప్పుకొవడానికి తనకు నచ్చిన ఏజెన్సీలను కోరే హక్కు, అవకాశం ఓ పౌరుడిగా ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ మరచిపోతున్నారు.


ఇదే సాగితే ఇబ్బందే :


జగన్ విషయంలో ఇదే తీరున టీడీపీ నాయకులు  ప్రచారం సాగిస్తే చాలా ఇబ్బంది వైసీపీకి వస్తుందని అంటున్నారు. దీనిపైన ఇప్పటికైతే వైసీపీ నుంచి క్లారిటీ ఇచ్చే నాయకుడు కనిపించలేదు. జగన్ కేసు విషయంలో ఏపీ పోలీసుల దర్యాప్తుపైన  అనుమానాలు ఉండి అలా అన్నాడని చెప్పే లీడర్ కనిపించడం లేదు. మరో వైపు టీడీపీ తన ప్రచారాన్ని ఓ దశకు తీసుకుపోతోంది. మరి దీనికి విరుగుడు మంత్రం వైసీపీ ఏం వేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: