Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 10:26 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : ఆపరేషన్ గరుడ ముసుగులో భారీ కుట్ర జరిగిందా ?

ఎడిటోరియల్ : ఆపరేషన్ గరుడ ముసుగులో భారీ కుట్ర జరిగిందా ?
ఎడిటోరియల్ : ఆపరేషన్ గరుడ ముసుగులో భారీ కుట్ర జరిగిందా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జరుగుతున్న వ్యవహారాలు, జరిగిన విషయాలను ఓసారి గుర్తు చేసుకుంటున్నవారికి అందరికీ ఆ అనుమానాలే ఎక్కువవుతున్నాయి. వైసిపి వర్గాలు, సామాన్య జనాలు కూడా జగన్ పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే అని నమ్ముతున్నారు. అంతేకాకుండా  మార్చిలో   మొదలైన గరుడ పురాణం ముసుగులో చంద్రబాబే భారీ కుట్రకు పథకం రచించారని ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయగానే ఆపరేషన్ గరుడ అమలు చేయాలని చంద్రబాబు అనుకున్న కారణంగానే అవుట్ డేటెడ్ నటుడు శివాజి చౌదరని రంగంలోకి దింపాడని ప్రచారం ఎక్కువైపోతోంది.

 operation-garuda-coup-for-murder-plan-on-ys-jagan-

అసలింతికీ ఆపరేషన్ గరుడను ఎందుకు తెరమీదకు తెచ్చారంటే మసకబారుతున్న ప్రతిష్టే  కారణం. పోయిన ఎన్నికల్లో ఒకవైపు నరేంద్రమోడి, ఇంకోవైపు పవన్ కల్యాణ్ ను పెట్టుకున్నా చంద్రబాబు అధికారంలోకి వచ్చింది కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే అన్న విషయం గమనించాలి. అటువంటి పరిస్ధితిల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగున్నరేళ్ళ పాలనలో చాలా వర్గాలను దూరం చేసుకున్నారు. పోయిన ఎన్నికల్లో అధికారంలోకి రావటమే ధ్యేయంతో అడ్డదిడ్డమైన హామీలను ఇచ్చేసిన చంద్రబాబు అముల్లోకి వచ్చేటప్పటికి ఫెయిలయ్యారు. దాంతో చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైపోయింది.

 operation-garuda-coup-for-murder-plan-on-ys-jagan-


ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత, మరోవైపు దూరమైన పవన్, మోడిలు. దాంతో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలో చంద్రబాబు అర్ధం కావటం లేదట. అందుకనే ప్రధాన ప్రతిపక్ష నేతను లేకుండా చేస్తే తనకు మళ్ళీ ఎదురుండదని చంద్రబాబు భావించారని వైసిపి వర్గాలు చెబుతుంటే జనాలు కూడా బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆపరేషన్ గరుడ పథకాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారని పలువురు అనుమానిస్తున్నారు. అయితే ఆపరేషన్ గరుడను అమలు చేయాలంటే సరైన వేదిక ఏదన్న విషయంపై తెగ ఆలోచించిన చంద్రబాబు విశాఖపట్నం విమానాశ్రయమైతే బాటుంటుందని నిర్ణయించారట.

 operation-garuda-coup-for-murder-plan-on-ys-jagan-

ఎందుకంటే, విమానాశ్రయాలన్నీ కేంద్రప్రభుత్వ పరిధిలో ఉంటాయి. అందులోను జగన్ ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. మూడు జిల్లాల్లో ఎక్కడి నుండి హైదరాబాద్ రావాలన్నా విశాఖపట్నం విమానాశ్రయం తప్ప మరో అవకాశం లేదు. హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు ప్రతీ శుక్రవారం కోర్టుకు జగన్ హాజరవుతున్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు. అందుకనే విమానాశ్రయాన్ని అందునా గురువారంను ఎంచుకున్నారట.

 operation-garuda-coup-for-murder-plan-on-ys-jagan-

విమానాశ్రాయన్నే ఎందుకు ఎంచుకున్నారంటే అక్కడ ఏమి జరిగినా మొత్తం సమస్యంతా కేంద్రప్రభుత్వం మెడకు చుట్టుకుంటుంది. అదే సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చంద్రబాబు భావించారు.  జగన్ పై హత్యాయత్నంలో ఏమి జరిగినా వైసిపి, బిజెపిలు కొట్టుకుచస్తాయని చంద్రబాబు అనుకుని ఉండవచ్చు.  అంటే విమానాశ్రయంలో ఏమి జరిగినా తను మాత్రం సేఫ్ గా ఉంటారు. ఒకవేళ మిస్సయితే అది కేంద్రప్రభుత్వ వైఫల్యంగా ప్రచారం చేయవచ్చు. ఇది, స్ధూలంగా చంద్రబాబు ప్లాన్ అని వైసిపి నేతలు అనుమానిస్తున్నారు.

 operation-garuda-coup-for-murder-plan-on-ys-jagan-

అయితే, ఆపరేషన్ గరుడ ఎక్కడ ఫెయిల్ అయ్యిందటే తనపై హత్యాయత్నం జరిగినా ఇప్పటి వరకూ జగన్ నోరిప్పలేదు. పైగా తాను బాగానే ఉన్నాను కాబట్టి అందరూ సంయమనం పాటించాలంటూ పిలుపిచ్చారు. దాంతో రాష్ట్రంలో ఎక్కడ కూడా అల్లర్లు జరగలేదు. అదే సమయంలో డిజిపి, మంత్రులు తొందరపడి చేసిన కామెంట్లతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అప్పటి నుండి పగ్గాలు చంద్రబాబు చేతిలో నుండి జారిపోయింది. అప్పటి నుండి చంద్రబాబుతో సహా మంత్రులు, ఎంపిలు, నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. విచిత్రమేమిటంటే ఆపరేషన్ గరుడను తెరపైకి తెచ్చిన శివాజిని విచారించక్కర్లేదని, ఎయిర్ పోర్టు క్యాంటిన్ కాంట్రాక్టర్ హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ఇంత వరకూ అనుకోలేదు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తే వాస్తవాలేంటో బయటకు వస్తుంది. మరి ఆ పని చేయటానికి చంద్రబాబు అనుమతిస్తారా ?


operation-garuda-coup-for-murder-plan-on-ys-jagan-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉచ్చుబిగిస్తున్న ఎన్ఐఏ..టిడిపి నేతల్లో  టెన్షన్
ఈ భవనం ఎవరిదో తెలుసా ?
భర్త కోసం ఫిరాయింపు మంత్రి కొత్త బేరం
ఎడిటోరియల్ : వాళ్ళిద్దరూ కలిస్తేనే జగన్ కు మంచిదా ?
సంచలనం : జగన్ ముందు ఇంటెలిజెన్స్ హల్ చల్
మెచ్యూరుడుగా మాట్లాడిన జగన్
ఎడిటోరియల్ : పవన్ మొదలుపెట్టిన కొత్త నాటకం
ఎడిటోరియల్ : టిఆర్ఎస్ నేతలతో జగన్ కీలక భేటీ
జగన్ కీలక సమావేశం
ఈ డాక్టర్ సాబ్ ఎవరో తెలుసా ?
ఎడిటోరియల్ : విజయసాయి అనుకుంటే అంతే...
ఎడిటోరియల్ : అసెంబ్లీ స్ధానాలపై ఎందుకు సర్వేలు చేయటం లేదు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.