Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 9:51 am IST

Menu &Sections

Search

ముఖ్యమంత్రి ప్రవర్తనతో పరువు కోల్పోతున్న టిడిపి ప్రభుత్వం

ముఖ్యమంత్రి ప్రవర్తనతో పరువు కోల్పోతున్న టిడిపి ప్రభుత్వం
ముఖ్యమంత్రి ప్రవర్తనతో పరువు కోల్పోతున్న టిడిపి ప్రభుత్వం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తీవ్రమైన విషయాల్లో తమ అధినేత, ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరు ప్రజల్లోనూ, జాతీయ స్థాయి పార్టీల్లోనూ మాకూ, మా పార్టీకి తలవంపులు తీసుకొస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలూ వాపోతున్నారు. దీన్నుంచి ఎలా గట్టెక్కాలా? అని తలపట్టుకుంటున్నారు.  ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరువల్ల అన్నింటి లోనూ అడ్డంగా దొరికి పోతున్నామని అవేదనను వ్యక్తం చేస్తు న్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై పట్ట పగలు పక్కా వ్యూహంతో విశాఖ విమానాశ్రయంలోనే హత్యాయత్నం జరిగితే బాధ్యతగల ముఖ్యమంత్రిగా స్పందించడంలో తప్పటడుగులు వేశారని, ఏదో చేద్దా మంటే ఏదో అయ్యిందని వాపోతున్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే దాన్నిఖండించి, ఆయన్ను పరామర్శించి, విచారణకు ఆదేశిస్తే ఎంతో హుందాగా ఉండేదని, అలాకాకుండా ఆ సంఘటనపై వెకిలి గా మాట్లాడటం, ప్రతిపక్ష నేతను వాడు అని అమర్యాదగా సంబోధించడం నలుగురిలో చెడ్డపేరు తెచ్చిందని టీడీపీకి చెందిన ఎంపీ ఒకరు అభిప్రాయపడ్డారు.  దాడి  జరిగాక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లారని, బీజేపీ వాళ్లు ఢిల్లీ నుంచి చెబితే మళ్లీ హాస్పిటల్‌లో చేరారని, ఇందంతా డ్రామా అని సీఎం స్థాయి వ్యక్తి పేర్కొనడం వల్ల జనంలో తమ పరువు పోయిందని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మా బాబు గారు తప్పుమీద తప్పు చేస్తున్నారని, ఇది పార్టీకి చాలా నష్టం చేకూర్చేలా ఉందని మరో ఎంపీ వాపోయారు. 
ap-news-telangana-news-ycp-leader-ys-jagan-mohan-r
హత్యాయత్నం విషయమై గవర్నర్‌ డీజీపీతో ఎలా మాట్లాడతారని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రశ్నించడంతగదని, ముఖ్య సంఘటన పై గవర్నర్‌ వివరాలు తెలుసు కుంటే తప్పెలా అవుతుందని, ప్రతీ దాన్ని రాజకీయం చేయడం తగదని ఆ పార్టీకే చెందిన సౌమ్యుడిగా పేరున్నమంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు. జగన్‌ పై హత్యా యత్నం కేసుపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తే హుందాగా ఉండేదని, అలా చేయక పోవడంతో తాము డిఫెన్స్‌ లో పడ్డామని, తప్పు తమ వైపు ఉందనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవు తోందని ఉభయగోదావరి జిల్లాలకు చెందిన సీనియర్‌ నేత ఒకరు అన్నారు. హుందాగా వ్యవహరించకుండా ఫ్లెక్సీల అంశాన్ని ముందుకు తేవడం, విమానాశ్రయంలో హోటల్‌ కూడా టీడీపీకి చెందిన వారిదే కావడం, దాని యజమాని పార్టీలో కీలక వ్యక్తులకు అతి దగ్గరి వ్యక్తి కావటంవల్ల తాము ఆత్మరక్షణలో పడ్డామని, జనం ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. 
ap-news-telangana-news-ycp-leader-ys-jagan-mohan-r
ఇటువంటి సమయంలో  గరుడ పురాణం అంశాన్ని సమర్థించడం సబబు కాదన్నారు. హత్యాయత్నం సంఘటన జరిగిన రెండు గంటలకే డీజీపీ హడావుడిగా మీడియాతో మాట్లాడుతూ , వైసిపి అభిమానే జగన్‌ పై కత్తితో దాడి చేశాడని ప్రటించడం, రాత్రి సీఎం మాట్లాడుతూ సంఘటన జరిగిన నాలుగున్నర గంటల తరువాత తమకు వివరాలు తెలిసాయని చెప్పడంతో తాము చెప్పేది తప్పని తెలిసిపోయిందని రాయలసీమకు చెందిన సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. 
ap-news-telangana-news-ycp-leader-ys-jagan-mohan-r
ఇవన్నీ ఒక ఎత్తయితే, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ జగన్‌ పై హత్యాయత్నం వెనుక ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెప్పడం ఇంకా తలవంపులు తెస్తోందని, ఇది విని జనాలు ముక్కుమీద వేలేసుకుంటున్నారని గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ఒకరు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి బినామీ అయినరాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు తదితర వ్యాపార,రాజకీయ నాయకుల సంస్థల అక్రమాలపై ఆదాయ పన్నుశాఖ పరిశీలనలు, సోదాలు చేయడాన్ని తప్పుపట్టడం, వాటిని ఒక జాతీయ సమస్యలాగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడాన్ని ఇతర పార్టీల నేతలు ఎద్దేవా చేస్తున్నారని పలువురు ఎంపీలు అభిప్రాయపడ్డారు. 

ap-news-telangana-news-ycp-leader-ys-jagan-mohan-r
పన్ను ఎగవేతదారులు, తప్పుడు ఆదాయాన్నిచూపే వారిపై రాజ్యాంగపరంగా ఏర్పాటైన సంస్థ పరిశీల నలు చేయడం అత్యంత సాధారణ అంశమని ఇతర పార్టీలు గుర్తు చేస్తున్నాయని అన్నారు. దాన్ని ప్రశ్నించే హక్కు ముఖ్యమంత్రికి కూడా లేదని, కేంద్ర సంస్థల సామర్ధ్యం, విశ్వసనీయతను దెబ్బతీసేలా, విధులను అడ్డగించడం ఎలా సమర్ధనీయమంటున్నారని ఎంపీలు చెప్పుకొచ్చారు. 
ap-news-telangana-news-ycp-leader-ys-jagan-mohan-r
గతంలో చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారంటే ఇతరపార్టీల నాయకులు, మీడియా కలవడానికి ఇష్టపడేదని, ఇప్పుడు ఆ పరిస్థితు లు అసల్లేవని అంటున్నారు. చివరకు బీజేపీ ని వ్యతిరేకించే పార్టీలు, మీడియా కూడా అంటీముట్టనట్లు వ్యవహరించాయని చంద్రబాబును వెన్నంటి ఉండే ఓ ఎంపీ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడి వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దే నాయకులు కూడా తమను కేంద్రంలో పట్టించుకునే వారు కరవయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. 

ap-news-telangana-news-ycp-leader-ys-jagan-mohan-r

జగన్‌పై దాడి విషయంలో  టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ చేసిన  వ్యాఖ్యలపై  టీడీపీకే చెందిన మరో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్  సీరియస్‌ గా స్పందించారు.  రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను జూపూడి తప్పుబట్టారు. ఒక జోకర్ మాదిరిగా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.


మంగళవారం నాడు అమరావతిలో  ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక సీరియస్‌ సబ్జెక్టుపై చర్చ జరుగుతున్న సమయం లో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు.  జగన్‌ పై దాడి విషయంలో తల్లి విజయలక్ష్మి,  సోదరి షర్మిల కుట్ర పన్నిఉంటారని రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై జూపూడి స్పందించారు. సీరియస్ విషయాల్లో జోకులు వద్దంటూ జూపూడి  తన సహచర ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కు సూచించారు.  ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు. 

ap-news-telangana-news-ycp-leader-ys-jagan-mohan-r

"అరవింద సమేత...." సినిమాలో సీరియస్ సన్నివేశాలు జరుగుతుండగా...  ఆకు కావాలా...పోక తింటావా... అంటూ  జోకర్ల సన్నివేశాలను జూపూడి ప్రభాకర్ రావు గుర్తు చేశారు. జోకర్ మాదిరిగానే  రాజేంద్రప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారని జూపూడి అభిప్రాయపడ్డారు. తాము ఈ ఘటనపై బ్రహ్మనందం తరహాలోనే  బాబు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను చూస్తామని జూపూడి వ్యాఖ్యానించారు.

ap-news-telangana-news-ycp-leader-ys-jagan-mohan-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహాకూటమిలో మహామాయ - బాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ - టిడిపి మార్క్ వెన్నుపోటు!
జాబితాలో పేరు లేకున్నా ఓటరుగా నమోదై ఉన్నవారు ఓటు వేయవచ్చు! ఎలా అంటే!
భారత్ చైనాకు గుణపాఠం - మాల్దీవ్స్ లో ప్రజాస్వామ్య ప్రతిస్ఠాపన
తారస్థాయికి చేరిన రాష్ట్ర అవినీతి: మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తదితరుల ఆవేదన
టిడిపి జోకర్ల నిలయమౌతుందా! అల్లుణ్ణి మించిన మామ కథ!
న్యాయ వ్యవస్థకు మకిల పట్టించారు! ఇక ఎన్నికల్తో కడిగెయ్యటమనా?
శబరిమల ప్రవేశం కంటే మహిళలకు ముఖ్య సమస్యలు లేవా? బంగ్లా రచయిత్రి తస్లిమ నస్రీన్
జగన్ హత్యాయత్నం వెనకున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రే!
సన్నీ లియోన్ స్టెప్స్ - సిల్వర్ స్క్రీన్ షేక్స్
చంద్రబాబు క్లీన్ బౌల్డ్ – ఇక నందమూరి కుటుంబం మాత్రమే టిడిపికి శ్రీరామరక్ష
దేశ వ్యాప్తంగా "సిబీఐకి నో ఎంట్రీ" యేనా?  ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం తప్పే: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
చంద్రబాబు నమ్మక ద్రోహి-రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని అంతం చేయటం కాదు: రోజా భర్త
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు “రాష్ట్రపతి పాలన” కు దారి తీస్తున్నాయా?
ఆయనకు వ్యూహాలు రాజకీయాలే ఊపిరి! చంద్రబాబు పడగనీడలో తెలంగాణా!
చంద్రబాబు కుటుంబ రాజకీయం - అదే లేకపోతే ఆయన ఏమైపోతారో?
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ కి ప్రవేశం నిషేధం: జి.ఓ ఒక టిష్యూ పేపర్
About the author