వైసిపి నేతలు అవుననే చెబుతున్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. టిడిపి ఎంఎల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయి పై విధంగా రియాక్టయ్యారు. రాజేంద్ర మాట్లాడుతూ, పార్టీ పగ్గాల కోసం వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలలే జగన్ పై హత్యాయత్నం చేయించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజేంద్ర వ్యాఖ్యలను బట్టి తెలుగుదేశంపార్టీ నేతలు ప్రత్యర్ధులపై ఎంత నీచస్ధాయి ఆరోపణలైనా చేయటానికి వెనకాడరని అర్ధమైపోతోంది.


ఇక్కడ రాజేంద్ర ఆరోపణలతో అసలు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఎలాగయ్యారనే సంగతిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. పిల్లనిచ్చిన మామగారు, టిడిపి వ్యవస్ధాపకుడైన ఎన్టీయర్ ను వెన్నుపోటు పొడిచే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. విజయమ్మ, షర్మిలపై  రాజేంద్ర చేసిన ఆరోపణలపై వైసిపి శ్రేణులు మండిపోతున్నారనుకోండి అది వేరే సంగతి. జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో 25వ తేదీన జరిగిన హత్యాయత్నంపై పలువురు మంత్రులు నోటికొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ రాజేంద్ర చేసిన ఆరోపణలు మాత్రం టిడిపి నీచ మనస్తత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది.

 

ఆ విషయంపైనే విజయసాయి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పదవి వస్తుందని అనుకుంటే కొడుకు లోకేష్ ను కూడా లేపేయటానికి ఏమాత్రం వెనకాడని మనస్తత్వం చంద్రబాబుదే అంటూ విరుచుకుపడ్డారు. అవసరమైతే భువనేశ్వరిని కూడా లేపేయటానికి చంద్రబాబు వెనకాడడని విజయసాయి చెప్పటం గమనార్హం. జగన్ తల్లి, సోదరిపై టిడిపి ఎంఎల్సీ నీచమైన ఆరోపణలు చేశారు కాబట్టి తాము కూడా చంద్రబాబుపై అలాంటి ఆరోపణలు చేయాల్సొచ్చిందన్నారు. కాబట్టి జగన్ పై ఆరోపణలు చేసేటపుడు టిడిపి నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, నేతలను కంట్రోలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందని కూడా విజయసాయి హెచ్చరించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: