ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ దగ్గరలోని అరన్ పూర్ ప్రాంతంలో ఈ రోజు జరిగిన నక్సల్స్ దాడిలో దూరదర్శన్ కెమెరామ్యాన్‌తో పాటు ఇద్దరూ సెక్యూరిటీ అధికారులు స్పాట్‌లో మరణించారు. ఎలక్షన్ల ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో సంబంధిత కవరేజీ కోసం దంతెవాడ ప్రాంతానికి వెళ్తున్న దూరదర్శన్ రిపోర్టర్లపై మావోయిస్టులు ఉన్నట్టుండి దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

Doordarshan Cameraman, 2 Cops Killed In Maoist Attack In Chhattisgarh - Sakshi

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో ఎన్నికల కవరేజ్ కోసం  వెళ్లిన దూరదర్శన్ బృందం, పోలీసులపై  దంతెవాడలోని అరన్పూర్‌ అడవుల సమీపంలో ఈ దాడి జరిగింది. మూడు రోజుల క్రితం ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ ప్రాంతంలో రెచ్చిపోయిన మావోయిస్టులు నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు.  ఈ దాడిలో వారు ల్యాండ్ మైన్ వాడారు. అంతే కాదు ఇదే దాడిలో మరో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో మరణించిన వారిలో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్‌తో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. 


ఈ ఘటనపై నక్సల్స్‌  ఆపరేషన్స్‌ డీఐజీ  పీ సుందర్‌ రాజ్‌  మీడియా  సమావేశం నిర్వహించారు.  చనిపోయిన మీడియా పర్సన్‌ను దూరదర్శన్‌ వీడియో జర్నలిస్టు అచ్యుతానందన్ సాహుగా గుర్తించామన్నారు.  ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారన్నారు.  పెట్రోలింగ్‌కు వెళ్లిన సందర్భంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: