ప్రజా సంక్షేమానికి పెద్ద పీట‌వేస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాల‌ను ప్రారంభించారు. అయితే, అదేస‌మ‌యంలో ఆయ‌న సామాజిక వ‌ర్గాల‌ను కూడా దృష్టిలో పెట్టుకుని అనేక ప‌థ‌కాలు, కార్పొరేష‌న్లు కూడా ప్రారంభిం చారు. దీంతో రాష్ట్రంలో అన్ని సామాజిక వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు, పేద‌ల‌కు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు కూడా న్యాయం జ‌రుగుతోంది. నిజానికి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రం అన్ని విధాలా అప్పుల్లో కూరుకుపోయింది. లోటు బ‌డ్జ‌ట్‌తో అత‌లాకుత‌ల‌మైంది. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో అభివృద్ధి జ‌ర‌గలేదు. పైగా కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రం కావ‌డంతో మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌లేదు. రాజ‌ధాని ఏర్పాటు, అధికారుల‌కు నివాసాలు, ఎమ్మెల్యేలు ఇలా అన్నివైపుల నుంచి ప్ర‌భుత్వంపై తీవ్ర మైన ఒత్తిడి పడింది. 


అయినా కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏమాత్రం వెనుక‌డుగు వేయ‌లేదు. అభివృద్ధి-ప్ర‌జాసంక్షేమం- అనే రెండు కాన్సె ప్టులతో ముందుకు వెళ్లింది. ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భుత్వం నుంచి ఏదో ఒక అభివృద్ధి ఫ‌లం అందించేలా ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. ఇదే.. చంద్ర‌బాబును పీక్ రేంజ్‌లో కూర్చోపెట్టింది. ప్ర‌తి ఒక్క‌రిలోనూ చంద్ర‌బాబును నిల‌బెట్టింది. ఆయ‌నొ చ్చారు కాబ‌ట్టే.. త‌మ జీవితాల్లో వెల‌గులు వ‌చ్చాయ‌నేలా.. ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌ధానంగా ప‌సుపు-కుంకుమ పేరుతో ఆయ‌న అమ‌లు చేస్తున్న వినూత్న ప‌థ‌కం మ‌హిళ‌ల‌ను మ‌రింత‌గా ఆక‌ర్షిస్తోంది. ఇక ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ల‌క్ష‌ల సంఖ్యంలో గూడులేని పేద‌ల‌కు ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు.


ఇలా అన్ని రంగాల‌నూ క‌ల‌పుకొని పోతున్నారు. ఈ నేప‌థ్యంలో అభివృద్ధి అనేది చేయ‌డం చంద్ర‌బాబుకే చెల్లింద‌నే టాక్ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇక‌, ఇప్పుడు తాజాగా చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం పార్టీ ఇమేజ్‌ను మ‌రింత‌గా పెంచింది. దేశ‌వ్యాప్తంగా దృష్టిని ఆక‌ర్షించిన పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసితుల విష‌యంలో చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం ఆయ‌న ఇమేజ్‌ను, రేటింగ్‌ను కూడా పెంచింది. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వరం ప్రకటించారు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో గిరిజన కుటుంబాలకు నిర్మిస్తున్న ఇళ్లకు అదనంగా రూ.75 వేలు ఇస్తున్నట్లుగానే.. గిరిజనేతర కుటుంబాలకు కూడా అదనంగా రూ.50 వేల చొప్పున ఇస్తున్న‌ట్టు చెప్పారు.  దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.245.53 కోట్ల భారం పడుతుంది. 


అయితే ప్రతి నిర్వాసిత కుటుంబం సంతోషంగా ఉండడమే తనకు ముఖ్యమని.. ఇందుకోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా వెనుకాడేదిలేదని చెప్ప‌డం ద్వారా చంద్ర‌బాబుమ‌రింత‌గా గిరిజ‌నుల్లోకి దూసుకుపోయారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో గిరిజ‌న నియోజ‌క‌వర్గాల్లో టీడీపీ ఆశించిన ఫ‌లితం రాబ‌ట్టుకోలేక పోయింది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు గిరిజనుల‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ ప్ర‌క‌ట‌న ఫ‌లితాన్ని ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: