ఆపరేషన్ గరుడ ఈ పేరు ఇపుడు ఏపీ రాజకీయాల్లో బాగా పాపులర్ అయింది. ఎక్కడ చూసినా అదే చర్చగా కూడా ఉంది. మరి అటువంటి టైటిల్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది, కాసుల వర్షమే కదా. ఆప్పట్లో సినీ రచయిత పోసాని క్రిష్ణమురళి ఆపరేషన్ ధుర్యోధన పేరిట పొలిటికల్ మూవీ తీసి హిట్ కొట్టాడు. ఇపుడు ఆపరేషన్ గరుడ కూడా మంచి పొలిటికల్ మసాలా మూవీ అవుతుందంటున్నారు.


ఎన్నికల ఆయుధమా :


ఆపరేషన్ గరుడ ఇది టీడీపీపై కేంద్రంలోని బీజేపీ, ఏపీలో వైసీపీ, జనసేన, కేసీయార్ అంతా కలసి చంద్రబాబు సర్కార్ ని కూలదోయడానికి పెద్ద కుట్ర చేస్తున్నారని సినీ నటుడు  శోంఠినేని శివాజీ చౌదరి చేస్తున్న ఆరోపణ. దానికి ఆధారం లేదు కానీ టీడీపీ అనుకూల మీడియా మాత్రం పెద్ద ఎత్తున పాపులారిటీ కల్పించింది. లేటెస్ట్ గా జగన్ మీద హత్యాయ‌త్నం జరిగినా అదంతా ఆపరేషన్ గరుడా అనే మానసిక స్థికి అంతా చేరుకున్నారు, జనాన్ని నమ్మించేస్తున్నారు. అదిపుడు ఎన్నికల ఆయుధంగా మార్చుకోవాలని కూడా చూస్తున్నారట.


సినిమా తీస్తా:


ఆపరేషన్ గరుడ స్రుష్టికర్త శొంఠినేని శివాజీ చౌదరి తొందరలో తాను ఇదే అంశంపై సినిమాను తీస్తానని చెబుతున్నారట. ఇది చాలా మంచి సబ్జెక్త్ అవుతుందని కూడా నమ్ముతున్నారట. శివాజీ  ఇలా ప్రకటించారంటే దీని వెనక ఎవరున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  శివాజీ ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీ మనిషి అని ముద్ర పడిపోయింది. దాంతో ఎవరైనా టీడీపీ నాయకులే తెరవెనక దీన్ని సినిమాగా తీయించాలని చూస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి.


ఆపరేషన్ హీరో:


సినిమాల్లో పెద్దగా పాపులర్ కాని శొంఠినేని శివాజీ ఆపరేషన్ గరుడ పురాణంతో మాత్రం బాగానే ఏపీ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నారని సెటైర్లు పడుతున్నాయి. శొంఠీనేని శివాజీ చౌదరి కంటే ఆపరేషన్ గరుడ శివాజీ చౌదరి అంటేనే అందరికీ తెలిసేలా ఆయన పేరు మోగుతోంది.  అన్ని విషయాలు చెప్పేసిన శివాజీ తన సినిమాలో కొత్తగా ఏం చూపిస్తారోనని అంటున్నారు. నిజానికి గరుడ పురాణం అంతా పాత అపరాధ పరిశోధన కధలో ఉన్నదే. దాన్నే మార్చి శివాజీ చౌదరి నొక్కి వక్కాణిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. మరి శివాజీ చౌదరి సినిమాలో హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఎవరన్నది తొందరలోనే బయటకు వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: