జగన్ దాడి గురించి టీడీపీ నేతలు మరీ భరి తెగించి మాట్లాడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ హద్దులు దాటి నోటికొచ్చినట్లు మాట్లాడినాడు. ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి వెనుక ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిల కుట్ర ఉందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీకి చెందిన జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు.

టీడీపీ నేత రాజేంద్రప్రసాద్...

సీరియస్ అంశాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని చెప్పారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. జగన్ మీద దాడిపై సొంత పార్టీ నేతనే తప్పుబట్టడం ఆ పార్టీకి షాక్ అని చెప్పవచ్చు. ఇది సీరియస్ విషయమని, జోకులు వద్దన్నారు. టీడీపీ నేత రాజేంద్రప్రసాద్... వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పైన దాడి విషయంలో ఆయన నేరుగా వారి కుటుంబ సభ్యుల పైనే ఆరోపణలు చేయడం గమనార్హం.

Image result for tdp mlc rajendra

జగన్ కుటుంబంలో అనేక విభేదాలు ఉన్నాయని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. తల్లి విజయమ్మను, సోదరి షర్మిలను జగన్ రాజకీయంగా అణగదొక్కుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో జగన్ పైన ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేశారనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. జగన్‌ను హత్య చేయడం ద్వారా సానుభూతితో వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని షర్మిల, విజయమ్మలు కుట్ర చేసి ఉంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఫోటో పెట్టుకొని ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. జగన్ పైన కత్తి దాడి విజయమ్మ, షర్మిల పనే అని తమ అనుమానం అని వ్యాఖ్యానించారు. పార్టీలో తమను ఎదగనీయకపోవడంతో, జగన్ చనిపోతే పార్టీ పగ్గాలు తమ చేతికి వస్తాయని విజయమ్మ, షర్మిలల ఆలోచన కావొచ్చునని వ్యాఖ్యానించారు. దీని పైనే జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: