టీడీపీ నేతలు మరియు వైసీపీ నేతలు ఇద్దరు ఎప్పడూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. చేసిన కామెంట్స్ కు సారీ చెప్పడం చాలా అరుదు అయితే వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సారీ చెప్పాడు. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ను ఉద్దేశించి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన క్షమాపణ తెలిపారు. నెల్లూరులో 'ది క్లాత్‌మర్చంట్‌ అసోసియేషన్‌ బిల్డింగ్‌'లో రాజన్న కంటి వెలుగు కంటివైద్య శిబిరాన్ని ఆయన సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ తన క్షమాపణతో కూడిన వివరణ ఇచ్చారు.

Image result for anil kumar yadav

ప్రతిపక్ష నాయకుడు, తమ పార్టీ వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో అనూహ్యంగా హత్యాయత్నం జరగడంతో భావోద్వేగంలో అలా మాట్లాడడం జరిగిందని...కానీ అలా మాట్లాడటం పొరపాటేనని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అంగీకరించారు. ఇంతకీ అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నారంటే?... నేను పిచ్చోడిని, నా మానస్థితి బాగా లేదు అంటూ ఆసుపత్రిలో సర్టిఫికెట్ తెచ్చుకుని ఒక కేసు నుంచి బయట పడిన బాలకృష్ణకు ఆసుపత్రి నుంచి సర్టిఫికెట్ తెచ్చుకుని...ఒక కేసు నుంచి బయట పడిన బాలక్రిష్ణకు వై.సి.పి.అధినేత జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్.

Image result for balakrishna

బాలకృష్ణ ఏదైనా కార్యక్రమానికి వెళితే ఎవరినో ఒకరిని కొట్టి వార్తల్లోకి ఎక్కుతుంటాడని...అందుకే చాలామంది బాలకృష్ణ కార్యక్రమానికి వెళ్ళాలంటేనే భయపడిపోతుంటారని ఎద్దేవా చేశారు. ఏ మీటింగ్ కైనా బాలకృష్ణ వెళ్ళి ఎవరినీ కొట్టకుండా తిరిగి వచ్చాడా అని వ్యంగాస్త్రాలు సంధించారు అనిల్. నందమూరి తారక రామారావు లాంటి గొప్ప మహనీయుడు కడుపున పుట్టిన చీడపురుగు బాలకృష్ణ అని...తండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వెనుకాలే తిరగడం ఆయనకు మాత్రమే చెల్లుతుందని వ్యాఖ్యానించారు. పులి కడుపులో పులే పుడుతుందనడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డే నిదర్శనమని, ఇంకోసారి జగన్ పై బాలకృష్ణ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో ఆయన క్షమాపణ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: