Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 2:12 am IST

Menu &Sections

Search

మహాకూటమి గెలిస్తే తెలంగాణ సంపద ఆవిరే!: కేటీఆర్‌

మహాకూటమి గెలిస్తే తెలంగాణ సంపద ఆవిరే!: కేటీఆర్‌
మహాకూటమి గెలిస్తే తెలంగాణ సంపద ఆవిరే!: కేటీఆర్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణలో ఉనికి కోల్పోయిన తన తెలుగు దేశం పార్టీకి ఒకింత ఊరటనివ్వడం - అధికార పార్టీకి అండగా నిలిచి తన రాజకీయ ఎత్తుగడలకు మద్దతు కూడగట్టుకోవడం అనే లక్ష్యంగా పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని సైతం తుంగలో తొక్కి కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశలు అడియాసలు అయ్యేలా కని పిస్తున్నాయి.

 

తెలంగాణలో అరాచకం సృష్టించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని, ఎన్నికల్లో కోట్లాది రూపాయల పంపిణీకి తెరతీశారని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ధ్వజ మెత్తారు. ఎన్నికల్లో పొత్తుకు ₹500 కోట్లు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు.

 

ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులతో బాబు తెలంగాణలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయిస్తున్నారని పేర్కొన్నారు. ధర్మపురిలో ముగ్గురిని తమ పార్టీ నేతలు పట్టుకున్నారని అన్నారు. ఎన్నికల సంఘం వెంటనే రంగంలోకి దిగి చంద్రబాబు అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం తెలంగాణ  భవన్‌ లో విలేకరులతోనూ, లింగాయత్‌లు పార్టీలో చేరిక సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు.

ap-news-telangana-news-chandrababu-conspiracy-to-t 

‘‘చంద్రబాబు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఏపీ సీఎంగా ఉండి చిల్లరమల్లర రాజకీయా లు చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అక్కడి ప్రజల సొమ్మును, పోలీసు యంత్రాంగాన్ని కుట్రలకు వాడుకుంటున్నారు. ఎన్నికల్లో పొత్తు కోసం ₹500 కోట్ల కు రాహుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తరువాత సర్వేల పేరుతో డబ్బుల పంపిణీ చేసేందుకు తెలంగాణకు పంపించారు. ఏపీ గురించి ఇక్కడ టీవీ ఛానళ్లలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తున్నా వారిని నమ్మకుండా డబ్బుల పంపిణీకి ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులను పురమాయించారు. ధర్మపురిలో ముగ్గురు దొరికి పోయారు.

ap-news-telangana-news-chandrababu-conspiracy-to-t 

 తాము విలేకరులమని చెబుతూ సంచరించిన వారిని స్థానిక యువకులు అనుమానించి గట్టిగా ప్రశ్నించగా,  తాము ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులమని ఒప్పుకున్నారు. శుక్రవారం సర్వే చేసిన ఏపీ పోలీసు వివరాలన్నీ మావద్ద ఉన్నాయి. ఆంధ్ర పోలీసులకు తెలంగాణ  ధర్మపురిలో ఏం పని? వారు దొరికిన అరగంటలోనే ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏసీపీ బోస్‌ ఫోన్‌చేసి విడిపించే ప్రయత్నం చేశారు. ఏపీ అధికారులు రేవంత్‌ రెడ్డిని కలిసి, ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు యువత నాయకుని వాహనంలో ₹50 లక్షలు దొరికాయి.

 

ఏపీ పోలీసులను చంద్రబాబు పంపడం వల్ల తెలంగాణలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. ఆయన అరాచకాలు చేస్తుంటే, తెరాస శ్రేణులు చేతులు కట్టుకుని ఉండవు. దీనిపై ఇప్పటికే ఎన్నికలసంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదుచేశాం. రాజకీయా లకు అతీతంగా ప్రతి నాయకుడి వాహనాన్నీ తనిఖీ చేయాలి. నా వాహనాన్ని తనిఖీ చేసినా అభ్యంతరం లేదు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కాంగ్రెస్‌, తెదేపాలకు మనుగడ లేదు.’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

 ap-news-telangana-news-chandrababu-conspiracy-to-t

‘‘దొంగల ఫోన్‌లు ట్యాప్‌ చేయాల్సిన దుస్థితి మాకు పట్టలేదు. అయినా మాది ఆపద్ధర్మ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎన్నికల సంఘం కిందే పనిచేస్తుంది’’ అని ఫోన్‌ల ట్యాపింగ్‌ ఫిర్యాదు గురించిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఆంధ్ర పాలకుల వల్ల ఉనికి కోల్పోయిన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్‌ తో ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. కేసీఆర్‌ మళ్లీ గెలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మహాకూటమి గెలిస్తే తెలంగాణ సంపద అమరావతికి తరలిపోతుందని కేటీఆర్‌ చెప్పారు.

ap-news-telangana-news-chandrababu-conspiracy-to-t

లింగాయత్‌ సమన్వయ సమితి అధ్యక్షుడు అశోక్‌, లింగాయత్‌ నేతలు శనివారం మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నన్ను బచ్చా! అని, తెలివిలేదని అన్నారు. నిజమే ఆయనలా కారు ఇంజిన్లో ₹3 కోట్లను తగులబెట్టే తెలివి నాకులేదు. ఉత్తమ్‌ అన్నట్లుగా నాకు పొగరు ఉంది. తెలంగాణలో పుట్టినవారికి రోషం, పొగరు ఉంటాయి. నేను ఉద్యమంలో జైలుకు వెళ్లాను. మరి రాహుల్‌ గాంధీ ఎప్పుడైనా జైలుకెళ్లారా?


తెలంగాణలో చంద్రబాబు ఆటలు సాగవు. తెరాస లో చేరుతున్న లింగాయత్‌లకు స్వాగతం. ఉమ్మడి పాలనలో అన్ని కులాల వారు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ వచ్చాక అన్ని కులాలు, ప్రముఖులు, మహానుభావులను ప్రభుత్వం గొప్పగా గౌరవించు కుంది. గతంలో మన యాసను చలనచిత్రాల్లో విలన్లకు పెట్టేవారు. ఇప్పుడు అదే యాసను హీరోలకు పెట్టి గౌరవిస్తున్నారు.’’ అని మంత్రి అన్నారు.

ap-news-telangana-news-chandrababu-conspiracy-to-t
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టిఎస్ ఆర్టీసి ఉద్యోగులను ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారన్న కేసీఆరే ‘సెల్ఫ్ డిస్మిస్ అయిపోతారా?’
మోడీ పై దాడి - ఈ రేంజ్ లో మోడీ శతృవులు కూడా కేంద్రంపై దాడి చేయలేదేమో!
పాన్ ఇండియా హీరోగా స్థిరపడ్డ ప్రభాస్ - ప్రాంతీయ హీరోగా మిగిలిపోయిన చిరంజీవి
బాబోర్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుందట – మరేంచేస్తాం! మనకప్పుడు అధికారమధంలో కళ్ళు కనపళ్ళేదు!
కేసీఅర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందా! ఇదే దానికి చిహ్నం!
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
వజ్రం లోపల మరో వజ్రం - ప్రపంచ అద్భుతం
పొరుగు దేశాలు - పాక్, చైనా - రెండింటికి భారత్ తీవ్ర హెచ్చరిక
అన్నీ మంచి శకునములే: మందగమనం ఉన్నా భవిష్యత్ ఆశాజనకం: ఐటీసి
జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ కు సీపీఐ ఝలక్?
About the author