జగన్ మీద దాడి ఘటన గురించి చంద్ర బాబు ధర్మ పోరాట దీక్షలో విమర్శలు చేశాడు. అయితే జగన్ పైన కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో ఉన్న విమానాశ్రయంలో దాడి జరిగిందని గుర్తు చేశారు. తాను జగన్ వీరాభిమానిని అని, జగన్ పైన సానుభూతి వచ్చేందుకే దాడి చేశానని నిందితుడు శ్రీనివాస రావు చెప్పారన్నారు. అతనే చేశాడా లేక వారు చేయించుకున్నారా తెలియాల్సి ఉందని చెప్పారు. 

కోహ్లీ నుంచి చాలామంది ఉన్నారు, బాధపడ్డాను

కోహ్లీ నుంచి ప్రతి క్రికెటర్ విశాఖపట్నంలో ఉన్నారని, అలాంటప్పుడు ఈ ఘటన జరిగిందని, అప్పుడు ఏపీకి అప్రతిష్ట వస్తుందని బాధపడ్డానని, జగన్‌తో మాట్లాడాలనుకున్నానని, కానీ తననే ఏ1 అన్నారని వాపోయారు. తన రాజకీయ జీవితంలో హత్యాప్రయత్నాలు చేశానా అన్నారు. ముఠాలపై, మతసామరస్యం కోసం పోరాడానని చెప్పారు. తీవ్రవాదుల కోసం పోరాడానని అన్నారు. ఎక్కడా లాలూచీ పడలేదన్నారు. నేను రాజకీయ పోరాటం చేశాను తప్ప, కక్షలు లేవన్నారు. అలాంటి వాటిపై లేనిపోని ఆరోపణలా అన్నారు.

పోలీసులపై నమ్మకం లేకుంటే ఇంకెవరిని నమ్ముతారు?

నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ గురించి చాలా స్పష్టంగా చెప్పారని చంద్రబాబు అన్నారు. శివాజీ గత మార్చిలో చెబితే తాను మొదట నమ్మలేదని, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నమ్మాల్సి వస్తోందని అన్నారు. శాంతిభద్రతలు కాపాడుతామన్నారు. అనవసరంగా తప్పుడు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయాలంటే తెలుగుజాతి పౌరషం చూపిస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. మీకు భయపడాలా అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: