ఈరోజు మధ్యాహ్నం నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, జగన్ హత్యాయత్నం నిందితుడు శ్రీనివాసే స్వయంగా ఆ మాటలంటున్నాడు కాబట్టి. ఈరోజు మధ్యాహ్నం తనకు చాతీలో నొప్పిగా ఉందని, ఎడమ చెయ్యి తిమ్మిరిగా ఉందని చెప్పటంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

 

వెంటనే డాక్టర్ ను పిలిపించారు. నిందితుడుని పరీక్షించిన వైద్యుడు బిపి, షుగర్ లెవల్స్ నార్మల్ గానే ఉన్నాయన్నారు. అయినా శ్రీనివాస్ తన చాతిలో నొప్పి, చెయ్యి తిమ్మిరెక్కుతున్నట్టు చెప్పటంతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని కాజువాలిటి వార్డుకు తరలించారు. అక్కడి నుండి శ్రీనివాస్ ఆరోగ్యం విషయంలో పెద్ద డ్రామా మొదలైంది.

 

తన ప్రాణలకు హని ఉందని నిందితుడు గట్టిగట్టిగా కేకలు వేశారు. తనకు ఎటువంటి వైద్య సహాయం అవసరం లేదని తన అవయవాలు దానం చేసేయండంటూ గట్టిగా అరిచారు. వెంటనే మీడియాను పిలవండి తాను ప్రజలకు నేరుగా చెప్పుకోవాల్సుందటూ కేకలేశారు. అయితే, పోలీసులు శ్రీనివాస్ నోరు నొక్కేశారు. మొత్తం మీద వాహనంలో శ్రీనివాసును ఆసుపత్రికి తీసుకెళ్ళేటపుడు, ఆసుపత్రి కాజువాలిటీ వార్డులోను గట్టిగా కేకలేయటం మాత్రం వాస్తవం.

 

పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు తన ప్రాణాలకు హాని ఉందని కేకలు వేశాడంటే ఏమనర్ధం ? పోలీసుల కస్టడీలో ఉండగా నిందితుడిని బయట వ్యక్తులెవరూ కలిసే అవకాశాలు లేవు. ఉంటేగింటే అధికారపార్టీ నేతలకే అవకాశాలుంటాయన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా కస్టడీలో ఉండగా శ్రీనివాస్ కు ఏమన్నా అయితే అది ముందు పోలీసులకు తర్వాత చంద్రబాబుకు చుట్టుకోవటం ఖాయం.

 

జగన్ పై హత్యాయత్నం తర్వాత చేసిన కామెంట్లతో ఇఫ్పటికే  డిజిపి,  మంత్రులు, చంద్రబాబు అన్నీ వైపుల నుండి ఇరుక్కుపోయారు.  ఇఫుడు శ్రీనివాస్ కు ఏమన్నా అయితే ఇక చెప్పాల్సిన పనేలేదు.  జగన్ పై జరిగిన హత్యా ప్రయత్నానికి చంద్రబాబే కుట్రపన్నినట్లు ఇప్పటికే వైసిపి నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. దానికితోడు నిందితునికి ఏమన్నా అయితే జగన్ పై హత్యాయత్నం కుట్ర కచ్చితంగా తాను చేసినట్లు చంద్రబాబు అంగీకరించినట్లవుతుంది. చూద్దాం శ్రీనివాసుకు ఏమవుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: