తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబునాయుడు తెలివైన నేత. ఆయన చేయాలనుకున్నది చేస్తారు. చెయనిది కూడా ఎందుకు చేయలేదో కన్విన్స్ చేసే నేర్పరి. మాటలతోనే కధ రక్తి కట్టించడం బాబుకే చెల్లుతుంది.  బాబుకు సంబంధించి లేటెస్ట్ గా అలాంటిదే  మరో విషయ‌మిది.


పరామర్శించాలనుకున్నారట :


ప్రధాన  ప్రతిపక్ష  నాయకుడిపై హత్యాయత్నం జరిగితే పరామర్శించలేదన్న విమర్శలు బాబుని బాగానే గుచ్చుకున్నట్లున్నాయి. వ్యక్తిగత శత్రుత్వానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారన్న ఆరోపణలూ వినిపించాయి. జాతీయ స్థాయి నాయకులు సైతం జగన్ ఆరోగ్యం విషయంలో వాకబు చేస్తే సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కనీసం పన్నెత్తి పలకరించలేదు. పైగా రాజకీయ విమర్శలతో బురద జల్లేశారు. ఇపుడు ఆ పరామర్శ వైనాన్ని కూడా తనకు అనుకూలంగా తిప్పుకుంటున్నారు. కొత్త రాజకీయం వైపుగా దాన్ని  తీసుకెళ్తున్నారు. 


ఏ వన్ అంటారని భయమట:


జగన్ని ఫోన్లో పరామర్శిద్దామనుంటే ఆయన తనను ఎక్కడ ఏ వన్ నిందితుడు అంటారేమోనని భయమేసిందంట. ఇదీ చంద్రబాబు మార్క్ భాష్యం. ఎందుకు పరామర్శించలేదూ అంటూ లోకం దుమ్మెత్తిపోస్తూంటే మన బాబు గారి సమాధానం ఇలా ఉంది. జగన్ పై దాడి జరిగిన వెంటనే ఫోన్ చేయాలను ఆలోచన వచ్చినా మానుకోవడానికి ఇదే కారణమని బాబు చెబుతున్నారు. అంటే తాను పరామర్శిద్దామను మంచిగా అనుకున్నా జగన్ మాత్రం తనను నిందించే స్వభావి అంటూ ఇక్కడ కూడా మరో బురద వేశేశారు. 


బాధ్యత కాదా:


అప్పట్లో అంటే దాదాపు మూడు దశాబ్దాల క్రితం వంగవీటి రంగాను దారుణంగా హత్య చేశారు. టీడీపీ నేతలు చేయించిన పనేనని అంతా భావించిన రోజులవి. విజయవాడ అట్టుడికిపోతోంది. ఆ టైంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విజయవాడ వెళ్తానని అన్నారు. పోలీసులు, అధికారులు వద్దని వారించారు. అయినా రంగా భార్యను పరామర్శించడం తన ధర్మం అని ఆయన భావించి ఇంటికి స్వయంగా వెళ్ళారు. రంగా సతీమణి తలుపు తీయలేదు. వెనుతిరిగి వచ్చారు, అది వేరే విషయం. కానీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను అన్న గారు అలా నిర్వర్తించారు. మరి అటువంటి బాధ్యత బాబు చేసారా. ఫోన్ చేస్తే ఏదో అంటారు అంటూ ఊహాజనితమైన వ్యాఖ్యలతో మరింత రాజకీయం చేయడం రాష్ట్ర పెద్దకు తగునా.


మరింత సమాచారం తెలుసుకోండి: