జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని పావులు కదుపుతున్నారా? అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. ఏపీ రాజ‌కీయాల్లో ట్విట్ట‌ర్ ద్వారా సంచ‌ల‌నాల‌కు తెర‌దీశారు జ‌న‌సేనాని ప‌వ‌న్‌. ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టిన ఆయ‌న త‌న పార్టీ ప్రారంభం నుంచే ఓ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను ఏర్పాటు చేసు కున్నారు. రాష్ట్ర రాజ‌కీయాల‌పై ఆయ‌న ప్ర‌తి సారీ ట్విట్ట‌ర్ ద్వారానే స్పందిస్తూ వ‌చ్చారు. అయితే, ఈ ట్విట్ట‌ర్ స్పంద‌న‌లపై ప‌వ‌న్ ఊహించినంత‌గా ప్ర‌తి స్పంద‌నలు రాలేదు. పైగా ఆయ‌న ప్ర‌జ‌ల్లో ఉండ కుండా ట్విట్ట‌ర్ ట్వీట్లేంట‌నే వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు సైతం వ‌చ్చాయి. అయినా లెక్క చేయ‌కుండా ప‌వ‌న్ త‌న పంథానే కొన‌సాగించారు. 

Related image

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆయ‌న స్పందించిన తీరు మొత్తం ట్వీట్ల రూపంలోనే ఉండ‌డం అప్ప‌ట్లో విమ‌ర్శ‌ల‌కు సైతం దారి తీసింది. ము ఖ్యంగా ప్ర‌తిప‌క్షాలు, విద్యార్థులు సైతం రోడ్ల మీద‌కు వ‌చ్చి.. ఆందోళ‌న‌ల‌కు పిలుపు ఇచ్చిన‌ప్పుడు కూడా ప‌వ‌న్ ట్వీట్ల‌తోనే స‌రిపుచ్చారు. ఇక‌, ఏదేమైనా.. ఆయ‌న ట్వీట్లకు మెజారిటీ అభిమానులు వాలోవ‌ర్లుగానే ఉన్నారు. ఇక‌, క‌ట్ చేస్తే.. ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఆరు మాసాల గ‌డువు మాత్ర మే ఉంది. దీంతో ప‌వ‌న్ వినూత్న పంథాను ఎంచుకున్నారు. ట్విట్ట‌ర్ అయితే.. చాలా త‌క్కువ మంది ఫాలో వ‌ర్లు ఉన్నార‌ని తెలుసుకున్న ఆయ న తాజాగా ఫేస్ బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేశారు. తన పేరుతో అధికారికంగా ఫేస్‌బుక్ పేజీని ఆయన ప్రారంభించారు. 


పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమా లను తెలిపేందుకు ఫేస్‌బుక్‌ పేజీని ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 2న విజయవాడ నుంచి తుని వరకు పవన్‌ రైలు ప్రయాణం చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక ఇప్పటికే పూర్తైంది. ఈ ప్రయాణంలో రైలులోనే పలు వర్గాల ప్రజలతో పవన్‌కల్యాణ్‌ మాటామంతీ నిర్వహించనున్నారు. దీనితో పాటు తాను ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్నట్లు తన ట్విట్టర్ అకౌంట్లో రాసుకొచ్చారు పవన్ కల్యాణ్. మొత్తానికి ప‌వ‌న్ వినూత్న పంథానే ఎంచుకున్నా.. ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌న్న‌ది వేచి చూడాలి. ఇక‌, రాష్ట్రంలోని మూడు ప్ర‌ధాన పార్టీల్లో సోష‌ల్‌మీడియాలో ముందున్న‌ది మాత్రం టీడీపీనేన‌ని చెప్పాలి. 


ప్ర‌త్యేకంగా సీబీఎన్ ఆర్మీ పేరిట ఇప్ప‌టికీ టీడీపీ నాయకులు కొంద‌రు సోష‌ల్ మీడియాలో పార్టీని బ‌లోపేతం చేస్తున్నారు. ప్ర‌భుత్వంపైనా, పార్టీ అధినేత చంద్ర‌బాబు, మంత్రి లోకేష్‌పైనా వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు వెనువెంట‌నే వారు స‌మాధానం ఇస్తున్నారు. అంతేకాకుండా రిలేట‌డ్ ఐటంల‌ను కూడా కౌంట‌ర్‌గా జ‌త చేస్తున్నారు. ఇక‌, విప‌క్షం వైసీపీ ఈ విష‌యంలో చాలా వెనుక‌బ‌డే ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి తాజా ప్ర‌య‌త్నంతో జ‌న‌సేనాని టీడీపీని బీట్ చేస్తారో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: