తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే.  ఇప్పటికే తెలంగాణలో డిసెంబర్ నెలలో ఎన్నికలు జరపబోతున్నారు.  ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.  ఓ వైపు అధికార పార్టీ టీఆర్ఎస్ తాము చేసిన అభివృద్ది పనులకు ప్రజలు మళ్లీ పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు టీఆర్ఎస్ ఎలాగైనా ఓడించేందుకు టీ కాంగ్రెస్, టీడిపీ,తెలంగాణ జనసమితి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. 

అయితే డిసెంబర్ నెలలో సాధారణంగా వచ్చే సెలవులకు అదనంగా మరో రెండు రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ, తెలంగాణ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే డిసెంబర్ 7న, కౌంటింగ్ జరిగే 11వ తేదీన సెలవులు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.

అంతే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. ఒకవేళ ఉత్తర్వులు ఖాతరు చేయకుండా పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రెండు రోజుల్లో స్కూళ్లను తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: