ఓట్ల రాజకీయాలకు వారూ వీరూ లేరు. మరి పోలీసులు కూడా పెద్ద ఓట్ల వర్గమే. వారిని ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీ చేరదీసినది లేదు. ఇపుడు వారిని కూడా తిప్పుకునే కార్యక్రమం మొదలైది. అలా ఓ రాజకీయ పార్టీ పోలీసు దొరల ఓట్లకు గేలం వేస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలికే పోలీసులు ఆత్మ సాక్షిగా ఓట్లు వేస్తే మాత్రం  ప్రభుత్వాలు గల్లంతే


పోలీసు సెంటిమెంట్:


తండ్రి పోలీసు, మాది పోలీసు కుటుంబం ఇదీ జనసేనాని ప్రచారం. ఇంతకాలం సభల్లో అయన మాట్లడింది కూడా ఇదే. తాను ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకుని అని, ముఖ్యమంత్రి అయ్యే అవకాశరం పోలీసు కొడుక్కి ఉండదా అంటూ ఎర్ర టోపీలకు సెంటిమెంట్ ఎక్కించారు. సీఎం కుర్చీ వారసత్వ‌మా అంటూ పెద్ద ప్రశ్ణ వేశారు కూడా. అయితే పవన్ వారసత్వంగానే హీరో అయ్యార‌ని, ఆయన చిరంజీవి తమ్ముడిగానే జనాలకు తెలుసునని సెటైర్లు కూడా పడ్డాయి.


తల్లి దిశానిర్దేశం:


ఇక జనసేన ఆఫీసుకు వచ్చి పార్టీ కోసం నాలుగు లక్షల రూపాయాల విరాళం ఇచ్చిన జనసేనాని తల్లి అంజనాదేవి పవన్ ని ఒక కోరిక కోరార‌ట. నీ తండ్రి పోలీసు, కాబట్టి పార్టీ పరంగా పోలీసులకు కూడా అండగా ఉండేలా కార్యక్రమాలు చేపట్టు అని, ఇదిపుడు బాగా ప్రచారం అవుతోంది. పోలీసులను తమ వైపు తిప్పుకునేందుకు పవన్ ఓ విధంగా ప్రచారం చెసుకుంటూంటే తల్లి కూడా పోలీసుల గురించే చెప్పడంతో  జనసేనలో పోలీసులకు అధిక ప్రాధాన్యత ఉంటుందేమోనని అంటున్నారు.


మాజీలు రాజకీయాల్లోకి :


అనేకమంది మాజీ పోలీసు అధికారులు ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ, వైసీపీలో చేరి ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీకి రెడీగా ఉన్నారు. ఇపుడు జనసేనలోనూ పోలీసుల తాకిడి పెరిగేలా ఉంది. అయితే పవన్ ప్రవచించినట్లుగా  అయితే అది అధికారులకు మేలు చేయడం కాదు, దిగువ స్థాయి కానిస్టేబుల్లకు మేలు జరిగేలా ఏ రాజకీయ పార్టీ అయినా నిర్ణయం తీసుకుంతే అపుడే ఖాకీలు సంతోషపడతారు. ఆ పార్టీ వైపు వారు మొగ్గు చూపుతారు. అంతే తప్ప పోలీసుల గురించి సెంటిమెంట్ డైలాగులు కొడితే చిన్న ఉద్యోగుల బాధలు తీరవని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: