జగన్ దాడి గురించి టీడీపీ నేతలు ఎంతో ఘోరంగా మాట్లాడతున్నారు. ప్రతి పక్ష నేత మీద దాడి జరిగితే సానుభూతి చుపించాల్సింది పోయి నోటికొచ్చినట్లు మాట్లాడతున్నారు.  ఎలాంటి విచారణ లేకనే దాడి చేసింది జగన్ అభిమాని అంటూ డీజీపీనే ప్రకటించేశాడు. మరి ఆయనకు చిలకజోస్యం మీద అంత పట్టు ఉందో ఏమో! ఇక ఈ హత్యాయత్న ఉదంతంపై చంద్రబాబు కూడా ముసిముసి నవ్వలతో స్పందించాడు. మంత్రుల తోచినట్టుగా మాట్లాడారు.


జగన్ తో అందుకే మాట్లాడలేదు ... చాలా భాద పడ్డాను చంద్ర బాబు స్పష్టీకరణ...!

అయితే ఇలా మాట్లాడేస్తే అదీ కామన్ అయిపోతుందని అనుకున్నాడో ఏమో కానీ.. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మరి దిగజారడు అడుగులు వేశాడు. జగన్ మీద హత్యాయత్నం విషయంలో తన శైలిలో పరమ లేకి మాటలు మాట్లాడాడు. నీఛమైన వ్యాఖ్యానాలు చేశాడు. ఇవి ఎంత నీఛంగా ఉన్నాయంటే.. చంద్రబాబుకే కోపం వచ్చిందట. ఈ విషయంలో రాజేంద్ర ప్రసాద్ తీరును బాబు ఖండించేశాడట.


జగన్ తో అందుకే మాట్లాడలేదు ... చాలా భాద పడ్డాను చంద్ర బాబు స్పష్టీకరణ...!

ఈ విషయాన్ని అనుకూల పత్రికల్లో లీకు ఇచ్చేసుకున్నారట. హుందాగా ఉండాలని బాబు హితబోధ చేశాడట. అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? చంద్రబాబు నాయుడే బాధ్యత మరిచి.. ప్రతిపక్ష నేత మీద జరిగిన హత్యాయత్నం విషయంలో వెకిలిగా మాట్లాడతాడు. దాన్ని చూసి మిగతావాళ్లు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్లు మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: