జగన్ దాడి గురించి టీడీపీ నేతలు మాటలు మరీ దారుణంగా ఉన్నాయి. ప్రజలు వారి మాటలు ఈసడించుకునే స్థాయికి వచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు ప్రజలు టీడీపీ గురించి ఏమనుకుంటున్నారని.. వీరి దారుణమైన మాటలు  ఎలా ఉన్నాయంటే టీడీపీలో ఓ పెద్దమనిషి.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి జగన్‌ కుటుంబ సభ్యుల మీదనే తీవ్ర ఆరోపణలు చేసేశాడు. అయితే చంద్ర బాబు కూడా అదే స్థాయిలో విరుచుకు పడ్డాడు. మానవత్వం గురించి కూడా మరిచి పోయాడు. 

జగన్ తో అందుకే మాట్లాడలేదు ... చాలా భాద పడ్డాను చంద్ర బాబు స్పష్టీకరణ...!

రాజకీయాల్లో దిగజారుడుతనం గురించి పదే పదే మాట్లాడుకుంటూనే వుంటాంగానీ, ఈస్థాయి దిగజారుడుతనం గురించి ఎవరూ ఊహించి వుండరేమో. దాడి జరిగిన మాటవాస్తవం. అది ఎందుకు జరిగిందన్నది విచారణలో తేలుతుంది. విచారణ ఎలాగూ అధికార పార్టీ చెప్పినట్లుగానే జరుగుతుది కాబట్టి, చంద్రబాబు సర్కార్‌ కంగారు పడాల్సిన పనే లేదు. జగన్‌ని ఫోన్‌లో పరామర్శించేసి, వీలైతే ప్రత్యక్షంగా వెళ్ళి పరామర్శించి వుంటే.. చంద్రబాబు 'హుందాతనం' పెంచుకున్నట్లయ్యేది. ఆ తర్వాత రాజకీయ నాటకాలు.. వేరే వ్యవహారం. కానీ, ముఖ్యమంత్రి కాదు కదా.. మంత్రులు కూడా వైఎస్‌ జగన్‌ని పరామర్శించకపోవడం ఆశ్చర్యకరం.


జగన్ తో అందుకే మాట్లాడలేదు ... చాలా భాద పడ్డాను చంద్ర బాబు స్పష్టీకరణ...!

ఇప్పుడు ఇదే, తెలుగుదేశం పార్టీలోనూ చిచ్చుపెట్టేలా కన్పిస్తోంది. 'నేను నిప్పు' అని చెప్పుకునే చంద్రబాబుకి, కనీసపాటి మానవత్వం కూడా లేదని ఆఫ్‌ ది రికార్డ్‌గా తెలుగు తమ్ముళ్ళే చెప్పుకుంటున్నారు. ఇంత దారుణమా.? ఇంత అమానవీయమా.? విలువల్లేని వ్యక్తితో రాజకీయ ప్రయాణం చేస్తున్నామా.? అని కొందరు టీడీపీ ముఖ్యనేతలు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. చంద్రబాబు అహంకారం పీక్స్‌కి వెళ్ళిపోయిందంటూ ఆఫ్‌ ది రికార్డ్‌గా వాపోవడం మినహా, ఆ అసంతృప్తిని చంద్రబాబు వద్ద వెల్లగక్కేంత సీన్‌ టీడీపీలో ఎవరికీ లేకపోవడం గమనార్మం.


మరింత సమాచారం తెలుసుకోండి: