తెలంగాణలో 2014ఎన్నికల్లో ఉనికి కోల్పోయి, ఓటుకు నోటు కేసుతో సర్వం కోల్పోయిన తన తెలుగుదేశం పార్టీకి ఒకింత ఊపు, హోపు ఇవ్వడం – 2019లో కాంగ్రెస్అ ధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీకి అండగా నిలిచి తన రాజకీయ వ్యూహాలకు మద్దతు కూడగట్టు కోవడం అనే లక్ష్యంగా-ఆ పార్టీ ఆవిర్భావ సిద్ధాంతం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని సైతం తుంగలో తొక్కి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆశలు అడియాసలు అయ్యేలా కనిపిస్తున్నాయి. 
సంబంధిత చిత్రం
పొత్తు పేరుతో టిడిపి అధిస్ఠానం కాళ్లుపట్తుకొని తమ సీట్లకు ఎసరు పెడుతుండటంపై ఇప్పటికే కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు భగ్గుమంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, లెడీ అమితాబ్ గా ప్రసిద్ధిగాంచిన విజయశాంతి కీలకవ్యాఖ్యలుచేశారు. కేవలం ఎన్నికలకోసమే తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా మని ఆమె స్పష్టం చేస్తూ, అది కూడా కొన్ని పరిమితులతోనే తమ పార్టీల మధ్య మిత్రబంధం ఉంటుందని చెప్పారు. తద్వారా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయోగాలకు తమ పార్టీగాని, సభ్యుల్నిగాని వేదిక చేయటం మన్నించబోమని చెప్పారు. 
chandrababu vijayasanti కోసం చిత్ర ఫలితం
మొదటి నుంచి కాంగ్రెస్-టీడీపీల పొత్తును విజయశాంతి విబేధిస్తున్నారు. టీడీపీతో పొత్తుపై ప్రజల్లో ఆమోదయోగభావనలు లేవని గతంలో వ్యాఖ్యానించిన విజయశాంతి - పొత్తులకు తాను వ్యతిరేకం కాదని - కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు మిత్రపక్షాలు కోరవద్దని సూచించారు.  కాంగ్రెస్ ప్రచార సారథి హోదాలో విజయశాంతి చేసిన ఈ కామెంట్లు ఆ సమయంలోనే సంచలనం రేకెత్తించగా, తాజాగా ఆమె మరింత సంచలన కామెంట్లు చేశారు. “పరిమితులతోనే తాము బాబు పార్టీతో పొత్తుపెట్టు కుంటున్నాము” అని స్పష్టం చేస్తూ, ”ఈ పొత్తు ఎన్నికల వరకు మాత్రమే” అని ఆమె క్లియర్ చేశారు కూడా. 
congress TDP allience in telangana కోసం చిత్ర ఫలితం
ఒక వైపు కూటమిలో సీట్ల సర్దుబాటు మరియు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖరారు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు టీడీపీకి ధారుణమైన కుదుపుకు గురి చేశాయని చెప్తున్నారు. విజయశాంతి కామెంట్లు చంద్ర బాబు ఆశలకు మొగ్గ దశలోనే సంధికొట్టిస్తున్నాయని, ఆయన ఆశలు అడియాసలు అయ్యేది గ్యారెంటీయే అని అంటున్నారు. 
సంబంధిత చిత్రం
కాంగ్రెస్ సొంతగా గెలిచే అవకాశాలు లేవని - అప్పుడు తమ చక్రం బాబు చక్రం తిప్పవచ్చునని టీడీపీ నేతల భావన. అందుకే ఇటీవలి సమావేశంలో గెలిచే కీలక స్థానాలు మాత్రమే కోరుకుందాం - ప్రభుత్వం  ఏర్పడిన తర్వాత మనం చక్రం తిప్పుదాం! అంటూ చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు భరోసా ఇచ్చారట. అయితే తాజాగా “పరిమితులు అంటూ టీడీపీ ఆశలపై, నీళ్ళు జల్లగా చంద్రబాబు  ఆశలు అడియాసలు చేసేలా కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోందని అంటున్నారు. ఎందుకంటే బాబుపై వారికి  అంతగ నమ్మకం లేదనే భవన వ్యక్తమౌతుంది. చంద్రబాబువైతే ఆశలు, వేరేవాళ్లవైతే ఎత్తులు అనే తెలుగుదేశం వైఖరిని కాంగ్రెస్ గుర్తించిందని తగిన సమయంలో తగినట్లు సమాధానం చెప్పటానికి కాంగ్రెస్ తయారుగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. కాపురంచేసే కళ కాలుతొక్కిన నాడే తెలుస్తుందని కాంగ్రెస్ ఎప్పటికీ టిడిపి పెత్తనాన్ని సహించదని విశ్లేషకుల వాదన.  
congress TDP allience in telangana కోసం చిత్ర ఫలితం
మహాకూటమితో కలిసి సాగడంవల్ల తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆ తర్వాత తమకు నామినేటెడ్ పోస్టులో  - ఎమ్మెల్సీ పదవులో లభిస్తాయని పలువురు టీడీపీ నేతలు ఆశ పడుతున్నప్పటికీ, అలాంటి అవకాశం లేదనే సంకేతాలు కాంగ్రెస్ ఇస్తోందని చెప్తున్నారు.  మొత్తం మీద చంద్రబాబు తమను అడ్డుపెట్టుకొని ప్రయోజనం పొందడం ఇక జరిగే పని కాదని ముందు నుంచే స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తుంది. 

congress TDP allience in telangana కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: