Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 12:34 am IST

Menu &Sections

Search

డాలస్ లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు మ్రోగిన భేరి

డాలస్ లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు మ్రోగిన భేరి
డాలస్ లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు మ్రోగిన భేరి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించే అమెరికా తెలుగు  సంబరాలు ఈ సారి ఇర్వింగ్ వేదికగా జరగనున్నాయి. దీనికి సన్నాహకంగా ఇర్వింగ్ లో నాట్స్ గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ నిర్వహించింది. అమెరికాలోని వివిధ నగరాల నుంచి నాట్స్ నాయకగణమంతా ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ కు విచ్చేసింది.  మే 24, 25, 26 తేదీల్లో జరిగే  తెలుగు సంబరాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు కార్యాచరణ ప్రణాళికపై నాట్స్ నాయకత్వం చర్చించింది. 

amirica-nats-sambaralu-ap-political-updates-telangana-poli

ఈ గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ డాలస్ పరిసర ప్రాంతాల తెలుగు ప్రజలు దాదాపుగా వెయ్యి మందికి పైగా భారీగా విచ్చేశారు.  ఈ కార్యక్రమంలో నూట యాభై మందికి  పైగా చిన్నారులు పాల్గొని తమ ఆట, పాటలతో అతిధులను అలరించారు. బావార్చి బిర్యానీస్  వారు పసందైన భోజనాన్ని అందించారు. ఇర్వింగ్ వేదికగా జరిగే అమెరికా తెలుగు సంబరాలు అంబరాన్నేంటే జరిపేందుకు తమ సహాయ సహాకారాలు అందిస్తామని డాలస్ లో ఉండే తెలుగువారు ఈ సందర్భంగా తెలిపారు.