ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయం లో హత్యాయత్నానికి పాల్పడిన నిందితులు శ్రీనివాస్ ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ పోలీసుల ఆధ్వర్యంలో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల అస్వస్థకు గురైన శ్రీనివాస్ పోలీసులు భుజాలపై వేసుకొని ఆస్పత్రికి తరలించడంతో రాష్ట్రంలో అనేక అనుమానాలు నెలకొన్నాయి శ్రీనివాస్ పై.

Image result for jagan attack

ఈ సన్నివేశం చూసిన వైసీపీ నేతలు నిజాలు బయటకు రాకుండా చంద్రబాబు నిందితుడు శ్రీనివాసుని లేకుండా చేద్దామని ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆరోపించారు. అయితే ఆసుపత్రికి వెళ్లిన శ్రీనివాస్ కి ఆరోగ్యం మొత్తం బానే ఉంది అని కొద్దిగా నీరసంగా ఉందని తెలిపారు వైద్యులు. దీంతో పోలీసులు మళ్లీ విచారణకు తీసుకెళ్లిన శ్రీనివాస్ కి మళ్లీ అనారోగ్యం అంటూ అనడంతో రాష్ట్రంలో జగన్ హత్యాయత్నం కేసు పై అనేక అనుమానాలు సామాన్యులకు నెలకొంటున్నాయి.

Image result for jagan attack

దీంతో పోలీసులు డాక్టర్ ను ఎయిర్ పోర్టు పీఎస్ కే పిలిపించి వైద్యం అందించారు. నిందితుడు శ్రీనివాస్ ను పరీక్షించిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అతడి ఆరోగ్య పరిస్థితి నార్మల్ గానే ఉందని తెలిపాడు.

Related image

కేవలం నీరసంగా ఉందని మాత్రమే శ్రీనివాస్ చెబుతున్నాడని వెల్లడించాడు. శ్రీనివాస్ కు బిపి, షుగర్, ఫల్స్ రేట్ బాగానే ఉన్నాయని డాక్టర్ తెలిపారు. మరోపక్క వైసీపీ నేతలు నిందితుడు శ్రీనివాస్ కి..అతని ప్రాణానికి ఏదైనా జరిగిందంటే దానికి పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: