తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడిని ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులపై రవి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పురందేశ్వరి. ఈ క్రమంలో పురందేశ్వరి జగన్ పై జరిగిన దాడిని ఖండించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రం మరింత నష్టాలపాలు అయిందని విమర్శించారు.

Image result for jagan attack

సానుభూతి కోస‌మే త‌న పై హ‌త్యాయ‌త్నం చేయించుకున్నాడ‌ని చంద్ర‌బాబు అన‌డం క‌రెక్ట్ కాద‌ని.. అధికారం కోసం జ‌గ‌న్ నాట‌కాలు ఆడుతున్నాడ‌ని, కావాల‌నే పొడిపించుకున్నాడ‌ని, క‌త్తి ఎంత‌లోతు దిగింద‌ని, వ్యాఖ్య‌లు చేసి టీడీపీ నేత‌లు పూర్తిగా దిగ‌జారి పోయార‌ని పురంధేశ్వ‌రి ఫైర్ అయ్యారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని అదే ఉంటే గతంలో అమిత్ షా కన్నా లక్ష్మీనారాయణ లపై దాడులు జరిగేవి కాదని పేర్కొన్నారు.

Image result for చంద్రబాబు purandeswari

చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా చంద్రబాబు వ్యవహరించడం నీచమైన రాజకీయానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఆపరేషన్ గరుడ సృష్టికర్త చంద్రబాబే అని ఆరోపించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ అధినేత జగన్ నవంబర్ మూడో తారీకు నుండి మళ్లీ పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ పార్టీ నాయకులు తెలుపుతున్నారు.

Related image

అయితే హత్యాయత్నం జరిగాక జగన్ మళ్లీ పాదయాత్ర కి రావటం పార్టీకి మంచి మైలేజ్ వచ్చే అంశం అని...ఇప్పటి నుండి వచ్చే మైలేజ్ ని జగన్ సరిగ్గా ఉపయోగించుకుని ఓటు బ్యాలెట్ బాక్స్ లో పడే అంతవరకు ఇదే ఊపు కొనసాగిస్తే...దేశ ప్రధానిని డిసైడ్ చేసే దానిలో జగన్ పాత్ర కీలకం అవుతుందని రాష్ట్రానికి అప్పుడు ప్రత్యేక హోదా రావడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




మరింత సమాచారం తెలుసుకోండి: