వైసిపి అధినేత జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి మంత్రంతో ఏదో సాధించాలని చూసినా, సాధారణ మానవత్వాన్ని టిడిపి అధినేత, బాబు రాజేంద్రప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి లాంటి ప్రజల చేత ఎన్నుకోబడని ఎమెల్సీలు, ఇతర టిడిపి మూర్ఖ ప్రజాప్రతినిధులు, మంటగలిపి వేసారని ఏపి ప్రజలకే కాదు దేశ ప్రజలకు విశదమైంది.

growing hatred on chandrababu in AP people due to attempt of murder on Jagan కోసం చిత్ర ఫలితం

అందుకే ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కారీర్ గ్రాఫ్ ఈ సంఘటన తరవాత ధారుణంగా పడిపోయింది. చంద్రబాబు ప్రతి చిన్న విషయంలోనూ, వైసిపి పై నిందలు వేయటం, తప్పితే కేంద్రంపై కాలుదువ్వటం లాంటి విషయాలను గమనిస్తున్నారు. పాలనలో మితిమీరిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, ఆర్ధిక దుబారా, వీటికి తోడు ధారుణమైన కులాభిమానం ఆయనను "రాజకీయం నిమజ్జనం"  చేసే పరిస్థితులు నెలకొన్నాయి. నిజంగా చెప్పాలంటే సాధారణ ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 

growing hatred on chandrababu in AP people due to attempt of murder on Jagan కోసం చిత్ర ఫలితం
ప్రతిపక్షనేత మహానుభావుడని కాదుకాని, ఆయనపై పోలీస్ యంత్రాంగం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎందుకుపనికి రానివాళ్లు చెసే వ్యాఖ్యానాలు ప్రజలకు అసహ్యాన్ని, ఏహ్యభావాన్న, అసలే హత్యాయత్నం నుండి తృటిలో తప్పించుకొని గండం నుండి బయటపడిన,  వైఎస్ జగన్ పై సానుభూతి వెల్లవకు,  తోడై ప్రజల్లో నిద్రాణంగా చంద్రబాబు ఆయన పంచమాంగ దళాలపట్ల ఉన్న వ్యతిరేఖత హిమోన్నతంలాగా పెరిగిపోతోంది.
jagan stabbed by srinivasa rao కోసం చిత్ర ఫలితం
దీనికి తోడు ఏవడో ఒక సామాన్యుడు తన కులపోడు అయినంత మాత్రాన ఆయన చెప్పిన ఆపరెషన్ ద్రవిడ రాక్షస గరుడ కుమార అనే పిచ్చి మాటలు పట్టుకొని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఒక బాజారులో తిరిగే ఙ్జానం లేని సామాన్యుడులా, నిరక్షరకుక్షిలా మాట్లాడటం, ప్రవర్తించటం జనాన్ని బాధిస్తుంది. గత నాలుగేళ్లుగా కేంద్రం ఇచ్చిన నిధులను తన కులానికి చెందిన గుత్తేదార్లకు, ఇద్దరు బినామీలని చెప్పబడుతున్న పార్లమెంటు సభ్యులు, వారి తండాలకు దారబోసి,  రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీయించిన చంద్రబాబుపై జనాగ్రహం కుతకుత లాడుతుంది.
growing hatred on chandrababu in AP people due to attempt of murder on Jagan కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నాన్ని రాజకీయంగా సొమ్ముచేసుకోవాలనే,  చంద్రబాబు గారి శకుని తంత్రం, అంతగా పారినట్టుగా కనిపించడం లేదు. జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం పార్టీ వినిపిస్తున్న వాదనకు విలువ లేకుండా పోయింది. ఇది కుట్రగా ప్రజలు  విశ్వసించే పరిస్థితి వచ్చింది.

 

జగన్మోహనరెడ్డిపై  హత్యాయత్నం విషయంలో టీడీపీ రెండు రకాల మాటలు వినిపిస్తోంది. 

1. జగన్మోహనరెడ్డి మీద జగన్మోహనరెడ్డినే  చేయించుకున్న దాడిగా ప్రచారం చేస్తున్నారు.

2. జగన్మోహనరెడ్డి మీద హత్యాయత్నం బీజేపీ చేయించింది

 somireddi babu rajendra కోసం చిత్ర ఫలితం

టీడీపీ నేతల్లో ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదు. నోటికొచ్చినట్లు మాట్లాడటం జనం గమనిస్తూనే ఉన్నారు. ఇది ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. వారు ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది జగన్మోహనరెడ్డి తన మీద తనే హత్యాయత్నం చేయించుకున్న దాడి అయితే  దాన్ని నిరూపించడానికి టీడీపీ కి పెద్దగా సమయం అక్కర్లేదు. అదే నిజం అయ్యుంటే టీడీపీ ఈ విషయాన్ని ఇప్పటికే నిరూపించేసేది. కానీ టీడీపీ ఆ విషయాన్ని రుజువు చేయడం లేదు. జస్ట్ అలా వాదిస్తోంది అంతే. డొల్ల వాదన వినిపిస్తోంది. రుజువు చేయడం లేదు. ఇలా టీడీపీ దొరికిపోతోంది.

 

ఇక కేంద్రాన్ని బూచిగా చూపించడం కూడా టీడీపీ కుటిల ప్రయత్నమే. ఎందుకంటే ఈ మధ్య అన్నింటికీ కేంద్రాన్ని నిందిస్తున్నాడు చంద్రబాబు. అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి అయ్యింది. ఇలా తెలుగుదేశం వాదనలు వీగిపోతున్నాయి. అందుకే ఈ వ్యవహారాన్ని తెరమరుగు చేయాలని  కూడా చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉన్నాడు.

 somireddi babu rajendra కోసం చిత్ర ఫలితం

అయితే చంద్ర బాబు ప్రయత్నాలు కూడా అంత సానుకూలంగా లేకపోవడంతో, జగన్మోహనరెడ్డిపై  హత్యాయత్నం టీడీపీని నిండా ముంచేస్తుందనే  అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీడీపీ లో దడ పుట్టిస్తున్నాయి ఈ పరిణామాలు.


దిక్కులేని పరిస్థితుల్లో ప్రజాదృష్టిని తప్పించటానికి డిల్లీ వీదుల్లో నాటకాలు ప్రారంభించాడు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించటానికి, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు మొదలెట్టినట్లు నాటకాలు ప్రారంభించినా అది కూడా అంతగా పారలేదు. ఈ లోగా వైసిపి నాయకులు దేశవ్యాప్త రాజకీయ నాయకుల కు చంద్రబాబు తీరు వివరిస్తూ ఆయన ఒక ప్రతిపక్షనాయకుని పై జరిగిన హత్యాయత్నాన్ని దానిలోని కుట్రను బయటపెట్తకుండా దాచిపెట్టటంలోని మర్మాన్ని ఎండ గట్టటం మొదలెట్టారు.
somireddi babu rajendra కోసం చిత్ర ఫలితం
మొత్తం మీద నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవం గురించి ఎప్పుడు మాట్లాడే చంద్రబాబు నోట్లో పచ్చివెలక్కాయ పడింది. ఈయన సీనియారిటీ, నిప్పు, వాచి ఉంగరం లేవు, అనే మాటలు సామాన్యుల నోళ్ళలో నానుతున్నాయి. చంద్రబాబు చెప్పే నీతులు, గోబెల్ సూత్రాలు, మాటలు, కోసే కోతలు, చెప్పే అబద్ధాలు, చేసిన 600 వాగ్ధానాలు, ప్రజలకు "ఆవు కథ" ప్రజలకు సాంగోపాంగం కంఠోపాఠంగా నోళ్ళలో నాంతున్నాయి. ఇది చాలు ప్రజలు భావించే మోసగాళ్ళైన రాజకీయ నాయకుల పతనాని కి అంటున్నారు ఏపి ప్రజలు.  
 jagan stabbed by srinivasa rao కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: