జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి సంబంధించి రోజులు గడిచేకొద్దీ తెలుగుదేశంపార్టీ నేతలు బయటకు వస్తున్నారు. చంద్రబాబునాయుడు ఆలోచనలకు భిన్నంగా తమ్ముళ్ళు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు వాదనతో తమ్ముళ్ళు బహిరంగంగా విభేదిస్తున్నారు. మొన్న 25వ తేదీన విశాఖపట్నం విమనాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే కదా. ఘటన జరిగిన గంటలోపే డిజిపి ఆర్పి ఠాకూర్ మాట్లాడుతూ, దాడి చేసింది జగన్ అభిమానే అని తేల్చేశారు. తర్వాత మంత్రులు మాట్లాడుతూ సానుభూతి కోసం జగనే తనపై తానే దాడి చేయించుకున్నారని ఆరోపించారు. చివరకు చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ పై హత్యాయత్నం ఘటనంతా డ్రామాగా కొట్టిపారేశారు.


సరే, చంద్రబాబు వాదనతో తమ్ముళ్ళల్లో ఎంతమంది ఏకీభవిస్తున్నారన్న విషయం తెలీదనుకోండి. ఒకవేళ విభేదించేవారున్నా బహిరంగంగా అయితే చంద్రబాబును కాదనే వాళ్ళుండరన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇద్దరు నేతలు చంద్రబాబు వాదనతో బహిరంగంగా ఏకీభవించటం పార్టీలో కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు రామారెడ్డి చంద్రబాబు వాదనను ఏకిపారేశారు. చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టారు. అంతేకాకుండా చంద్రబాబు నైజంతో తాను విభేదిస్తు తెలుగుదేశంపార్టీకి రాజీనామా కూడా చేశారు.

 

రామారెడ్డి విషయం అలా ఉండగా వైసిపిలో నుండి టిడిపిలోకి వెళ్ళిన అనంతపురం నేత గుర్నాధరెడ్డి ఏకంగా లోటస్ పాండులో జగన్ నివాసానికి వెళ్ళి మరీ పరామర్శించారు.  పరామర్శ పేరుతో ఈ మాజీ ఎంఎల్ఏ జగన్ ఇంటికి వెళ్ళటం టిడిపిలో సంచలనంగా మారింది. గుర్నాధరెడ్డి జగన్ ఇంటికి వెళ్ళటం ఎవరికీ ఇష్టం లేదు. అంటే వ్యక్తిగతంగా వాళ్ళకిష్టం లేదని కాదు. చంద్రబాబుకు ఇష్టంలేని పనిని మాజీ ఎంఎల్ఏ ధైర్యంగా చేయటం చాలామంది నేతలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబు వాదనతో, ఆరోపణలతో విభేదించే వారు ఇఫ్పటికి ఇద్దరు బయటపడ్డారు. ముందు ముందు ఇంకెతమంది బయటకు వస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: