ఏపీ రాజకీయాలు శరవేగంగా కదులుతున్నాయి. ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు దూసుకువస్తున్న వేళ ప్రత్యర్ధి పార్టీలను ఎదుర్కొని మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న చంద్రబాబునాయుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఏపీ రాజకీయాలతో పాటు, జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణలను కూడా బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.


కాంగ్రెస్ తో పొత్తు :


ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు దాదాపుగా ఖరారైంది. నిన్నటి వరకూ తెలంగాణాకే ఈ పొత్తు పరిమితం చేద్దామనుకున్న బాబు జగన్ పై దాడి తరువాత తన ఆలొచనలు మార్చుకున్నారని భోగట్టా. అందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ ని కలుపుకుని ఏపీలోనూ మాహా కూటమి ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. ఇకపై ఎటువంటి జంకూ గొంకూ లేకుండా ఈ పొత్తు ఆవశ్యకతను బాబే జనం ముందు ఉంచి మద్దతు కోరే అవకాశాలు ఉన్నాయి.


సీట్ల పంపకంపైనా క్లారిటీ:


ఏపీలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే సీట్ల పంపకం కూడా ఇలా  ఉండే అవకాశాలు ఉన్నాయి, మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను కాంగ్రెస్ కు 25 సీట్లు, అయిదు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు బాబు రెడీ అవుతున్నారు. మరో వైపు ఈ పొత్తుల్లోకి  వామ పక్షాలను కూడా చేర్చుకుని వారికి కూడా పది అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు ఇవ్వాలనుకుంటున్నరట. మిగిలిన 140 అసెంబ్లీ, 18 ఎంపీ సీట్లకు బాబు పోటీ చేస్తారని తెలుస్తోంది.


ఆ ముగ్గురూ గ్యారంటీ :


ఇక పొత్తులో భాగంగా కర్నూల్ జిల్లాలోనే ఎక్కువ అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ కి బాబు ఇవ్వజూపుతున్నట్లుగా సమాచారం. కర్నూల్ ఎంపీ సీటుకు కోట్ల సూర్యప్రకాశరావు,కాకినాడి ఎంపీ సీటుకు మాజీ కేంద్ర మంత్రి పళ్ళం రాజు, కడప జిల్లా రాజంపేట ఎంపీ సీటుకు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కి ఖాయం చేశేశారు. మిగిలిన రెండు కాంగ్రెస్ ఎంపీ సీట్లు అప్పటి పరిస్థితుల బట్టి నిర్ణయిస్తారు. జాతీయ స్థాయిలో ఉన్న అనుబంధం ద్రుష్ట్యా వామపక్షాలు కూడా బాబుతో కలసి ఏపీలో ముందుకు సాగే అవకాశాలు చాలా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: