ఏదో నలభైయేళ్ళ అనుభవం ఉంది కదా అని చెప్పే సోదంతా జనం నమ్మరు. సమాచారం అర చేతి మీదకు వచ్చిన రోజుల్లో చంద్రన్నలు చెప్పెదంతా నిజమేనని నమ్మే వెర్రి వెంగళాయలు ఎవరూ లేరు. రాజమౌళో? త్రివిక్రమో? సినిమా కథనో? దృశ్యాన్నో? కాపీ కొట్టేస్తే కొద్ది గంటల్లోనే అది గ్లోబల్ గా ఏ దేశపు సినిమా లోదో? అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోతోంది. ఆ దర్శకుదు దొంగో? దొరో? అనే స్వరూపం ప్రజలకు తెలిసి పోతుంది.

chandrababu hatred attitude కోసం చిత్ర ఫలితం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నైతికతను నిలువెత్తున పాతేసిన దానికి క్రింద వివరించిన విషయాలే నిదర్శనం:

*20కి పైగా వైసిపి టిక్కెట్ పై గెలిచిన ఎమెల్యేలను ఎంపి లను వారిచేత రాజీనామా చేయించ కుండా టిడిపిలో చేర్చుకోవటం.

*శాసన సభాపతి గత నాలుగేళ్ల నుండి టిడిపి లో చేరిన ఎమెల్యేల రాజీనామాలపై చర్యతీసు కోకుండా నింపాదిగా కాలయాపన చెయ్యటం ఏ నిజాయతీని, నైతికతను చూపిస్తుంది.

*17కు పైగా చంద్రబాబు నేరారోపణలున్న కేసులపై వివిధ కోర్టులలో ఉన్న తన కులజనులను సిస్టం ద్వారా నియంత్రించి విచారణలు నిలుపుదల చేయించుకోవటం ఏ రీతిన నైతికత అని పించుకుంటుంది.

*ఓటుకు నోటు కేసు ద్వారా తెలంగాణా లో నామినేటెడ్ ఎమెలే ను కొనటానికి ప్రయత్నించి భంగపడ్ద విషయం ఏ నైతికతను సూచిస్తుంది.

chandra babu maya కోసం చిత్ర ఫలితం

*అదే దుర్మార్గపు ప్రయోగం ఆంధ్రప్రదేశ్ లో సభాపతిని వినియోగించుకొని (₹11 కోట్లు ఎన్నికల్లో ఖర్చుపెట్టి ఎమెల్యే అయ్యానని ఆయనే చెప్పారు కదా!) వైసిపి ప్రజాప్రతినిధులను కొనటం ఏ నైతికతను సూచిస్తుంది.

*తన కులజనులు మాత్రమే రాజకీయ, ఆర్ధికంగా, అధికారికంగా ఎదగగా మిగిలిన 97% ఇతర కులాల అభివృద్ధి పట్తించుకోని ఈయ్హన నైతికత విలువెంత?

అలాంటి వ్యక్తి డిల్లీ చేరి ఈయన బ్రతుకు తెలియని వారికి ప్రజాస్వామ్య సూత్రాలు, నరెంద్ర మోడీ నియంతృత్వం గురించిమాట్లాడటం “దొంగే పోలీసును దొంగా దొంగా! అని కేకలేసినట్లుంది”

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు విమర్శించారు. చెప్పిన హామీలేవీ మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువస్తానని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు.

chandra babu maya కోసం చిత్ర ఫలితం 

దేశంలో పెట్రో ధరలు ఊహించని విధంగా పెరిగాయి.

విజయ్ మాల్యా, నీరవ్ మోదీ దేశం విడిచిపోయినా పట్టించుకోవడం లేదు. 

దేశంలో రైతులంతా నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది.  దేశానికి ఏకపార్టీ ఆధిపత్యం మంచిది కాదు.

ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర:

 chandrababu caste favour & caste feelings కోసం చిత్ర ఫలితం

ఏపీలో రాజకీయ పరిణామాలను అందరూ గమనిస్తున్నారు.

ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరుగుతోంది.

రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి.

తెలంగాణ లో టీడీపీని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు.

సంబంధిత చిత్రం 

రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతు తీసుకున్నారు. ఆ పార్టీతో బీజేపీకి చీకటి ఒప్పందం ఉంది. నేర చరిత ఉన్న పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. అందుకే ఎన్డీయే తో తెగతెంపులు చేసుకున్నా. విభజన హామీలను కేంద్రం ఏ ఒక్కటీ అమలు చేయలేదు.  వెనకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్నారు. 

chandrababu caste favour & caste feelings కోసం చిత్ర ఫలితంతిత్లీ, హుద్ హుద్‌ తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం.

రాష్ట్రాల మధ్య ప్రధాని సమస్యలు సృష్టిస్తున్నారు.

రాజ్‌నాథ్ రాష్ట్రానికి వచ్చి కూడా తిత్లీ తుఫాను సాయం గురించి ఒక్క మాట మాట్లాడలేదు.

విభజన హామీలు అమలు చేయాలని 29 సార్లు ఢిల్లీకి వచ్చాను.

విశాఖ రైల్వే జోన్ అంశాన్ని పక్కన పెట్టేశాం. ఎన్డీయేతో విబేధించి బయటకు వచ్చిన వెంటనే మమ్మల్ని వేధిస్తున్నారు.

ఐటీ రైడ్స్ పేరుతో ఏపీపై దాడులు చేశారు. పెట్టుబడిదారులను భయపెట్టే ప్రయత్నం జరుగు తోంది.

chandrababu caste favour & caste feelings కోసం చిత్ర ఫలితం

జగన్‌ పై దాడి ఘటనపై బీజేపీ నేతలు టీడీపీ ని టార్గెట్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు లో దాడి జరిగితే మాకేమీ సంబంధం. తమిళనాడు తరహా లో ఏపీలో కూడా కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీబీఐ విషయంలోనూ కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదు. కీలక పదవుల్లో గుజరాతీలను నియమించారు. ఇవి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లవా?’ అంటూ ప్రశ్నలు సంధించారు.

chandrababu caste favour & caste feelings కోసం చిత్ర ఫలితం

విభజనకు ముందు నారా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండొచ్చు. నాడు దేశంలో చక్తం తిప్పి ఉండవచ్చు.  నేడు ఆయన జస్ట్ 25 పార్లమెంటరీ స్థానాలున్న రాష్ట్రాన్ని నడపలేని అసమర్ధతతో ఒకవైపు ప్రతిపక్షాన్ని మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ నాలుగేళ్ళుగా అటు జాతి సమయం ఇటు జన సంపద దుబారా చేస్తూ ఒక ప్రణాళికా కాలం ముగించనున్నారు. ఆయన ప్రవర్తన ఒక రాజకీయనాయకుడుగా మాత్రమే కనిపిస్తుంది. బాధ్యతగల ముఖ్యమంత్రిగా విభజన ఫలాలను సాధించలేని నిర్వీర్యత స్థాయి నుండి ప్రతిపక్షనేత పై జరిగిన హత్యాప్రయత్నంలో కూడా సొమ్ము చేసుకోవాలనే తాపత్రయ పడే నీతి హీనస్థాయి దిగజారి పోయారు. ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా ఆయనను అంగీకరించలేము.

chandrababu caste favour & caste feelings కోసం చిత్ర ఫలితం 

ఇక్కడ ప్రజలు అసంధర్భ ప్రేలాపనలు కోరుకోవటం లేదు. ఐటి దాడులు ప్రభుత్వం అధికారం లో ఉన్న కుల జనులపైగాని, అధికారంలో ఉన్న వారి బినామీలపై గాని జరగ కూడదని ముఖ్యమంత్రి ఆశిస్తున్నారా? మీరు ముఖ్యమంత్రి అయింది మీ భూసంపద, ఆస్తులు, వ్యాపారాలు, కాంట్రాక్టులు కాపాడుకోవటానికా? మీ వందిమాగదుల కోసం సకల తెలుగు ప్రజలను ముంచటానికా? మీరు ఒక కులానికే ముఖ్యమంత్రా? ఒక పార్టీకే ముఖ్యమంత్రా? ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమమే పాలన అవుతుందా? తన కుమారుణ్ణి అందలమెక్కించగానే నిరుద్యోగసమస్య తీరిపోయిందా? ఎందుకు చంద్రబాబు ఇంతగా నైతికత కోల్పోతున్నారు? ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండకూడదా? ఐతే ప్రజాస్వామ్యం అనేదానికి అర్ధం ఏమిటి?

సంబంధిత చిత్రంప్రతిపక్షనాయకుడు అవినీతి పరుడని అనుక్షణం మీచే విమర్శించబడుతున్నా, ఏపి ప్రజల చేత దేశంలోనే గుర్తించదగ్గ ఆధిక్యతతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడేగా? అప్పుడు మీపై ప్రజలు ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి, బంధు ప్రీతి, చీకటి వ్యాపారాలు, ఇసుక, ఆయిల్, రెడ్-శాండల్, లైంగిక,  కుల  తది తర ప్రమాదకర మాఫియాలతో నిరంతరం విలసిల్లే మీ అమరావతి, ఆంధ్రప్రదేశ్ ల మాటేమిటి? 

chandrababu caste favour & caste feelings కోసం చిత్ర ఫలితం
నరెంద్ర మోడీ ఏం చేసినా అందరికీ ప్రయోజనమో కీడో సమానంగా తగుల్తుంది. మీ సంగతేంటి ప్రయోజనాలన్నీ మీకు, మీ కులానికి, మీ పార్టీకి, మీ పార్టీ కార్యకర్తలకేనా? వీళ్లను మించి కీడు అంతా ఇతరులకా? వాళ్ళ పరిస్థితి ఏమిటి?

మరింత సమాచారం తెలుసుకోండి: