ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే చంద్రబాబు ముందున్న కర్తవ్యమని టీడీపీ అంటోంది. అందుకోసమే ఆయన డిల్లీ టూర్ వేస్తున్నారుట. మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ఆ పార్టీ  వ్యతిరేక కూటమిని బలోపేతం చేసే ఉన్నత లక్ష్యంతో బాబు హస్తినకు పయనం అవుతున్నారని చెబుతున్నారు. బాబు తప్ప ఈ పని ఎవరూ చేయలేరని కూడా అంటున్నారు.


ప్రత్యేక హోదా ఇస్తారు :


ఏపీ ప్రజలకు కావాల్సిన ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని, అందువల్ల ఆ పార్టీతో కలిస్తే తప్పు లేదని మంత్రి కింజరపు అచ్చెమ్నాయుడు ఈ రోజు మీడియాతో మాట్లాడుతో ఛెప్పారు.  విభజన హామీలు కూడా నెరవేరుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం, పుచ్చుకోవడం తెలుగు ప్రజల అభీష్టం ప్రకారమే జరుగుతుందని మంత్రి సమర్ధించుకుంటున్నారు.


జాతీయ కూటమి వరకే :


కేంద్రంలో బలమైన కూటమి ఏర్పాటు చేయాలన్నది బాబు ఆశయమని  అచ్చెన్న అంటున్నారు. ఆ దిశగా ఆయన చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని కూడా చెబుతున్నారు. కూటమికి నాయకత్వం వహించాలన్న ఆలోచన ఏదీ తమ నాయకుడికి లేదని కూడా ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కాంగ్రెస్ తో కలుస్తున్నామని అచ్చెన్న అన్నారు. 


ప్రధాని పదవి వద్దు:


చంద్రబాబుకు ఏనాడూ ప్రధాని పదవిపై ఆశలు లేవని మంత్రి చెప్పారు. దేశ క్షేమం కోసమే ఆయన తాపత్రయపడుతున్నారు. విభజన హామీలు నెరవేరుస్తారని బీజేపీతో కలసి వెళ్తే ఆ పార్టీ నమ్మించి మోసం చేసిందని అచ్చెన్న విమర్శించారు. అందువల్ల ఇపుడు కాంగ్రెస్ తో కలవడం అనివార్యమైందని కూడా చెప్పుకుంటున్నారు. మరి  చూడాలి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో.,


మరింత సమాచారం తెలుసుకోండి: