Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 1:18 am IST

Menu &Sections

Search

రాష్ట్రంలో టార్గెట్ వైసిపి-బయట బిజెపి-అంతా అవకాశవాద రాజకీయమే-పాలన ఫినిష్?

రాష్ట్రంలో టార్గెట్ వైసిపి-బయట బిజెపి-అంతా అవకాశవాద రాజకీయమే-పాలన ఫినిష్?
రాష్ట్రంలో టార్గెట్ వైసిపి-బయట బిజెపి-అంతా అవకాశవాద రాజకీయమే-పాలన ఫినిష్?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అధికారపక్షం ఏం చేసినా ప్రతిపక్షానికి అది ప్రతీకార కక్షపూరిత చర్యే అవుతుంది. అలాగే ప్రతిపక్షం ఏం చెసినా ప్రభుత్వంపై వ్యూహాత్మక దాడి గానో లేక కుట్ర గానో భావిస్తుంది. కాని చంద్రబాబు నిన్నటి వరకు జాతీయ ప్రజాస్వామిక కూటమితో స్నేహం చేసిన రోజుల్లో కనిపించని తప్పులు ఇప్పుడు మోడీలో బిజెపిలో కనిపిస్తున్నాయి. ప్రజలు వెదవాయిల్లాగానో, చవటాయిల్లాగానో కనిపిస్తుండవచ్చు ఆయనకు. ఇప్పుడు బిజెపిని-టిడిపిని రెండింటిని ఒక గాట కట్టేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు విడివిడిగాను ఇద్దర్ని కూడా కలిపి బంగాళాఖాతంతో విసిరెయ్యనున్నారు.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

నారా చంద్రబాబు నాయుడు రాజాకీయాలు చేస్తున్నది తన, తన కుల జనుల వ్యాపారాలు, పరిశ్రమలు, కాంట్రాక్టులు, భూదందా, రియల్ ఎస్టేట్, నావల్ డాక్యార్డ్, సాఫ్ట్ వేర్, సినిమా, ఎంటర్టెయిన్మెంట్, అడ్వర్టైజ్మెంట్, స్టూడియోస్, ఫిల్మ్ సిటీఎస్, మీడియా హఔజెస్... ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత పొడవున ఈ కుల జనుల దందాలు గుత్తాధిపత్యం వహిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు దేశ వ్యాప్తంగా ప్రపంచంలోని కొన్నిదేశాల్లో విస్త్రుతంగా వ్యాపించిఉన్నాయి.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

వీటన్నిటికి రాజకీయ రక్షణ కలిగిస్తూ పెట్టని కోటలా గత నాలుగు దశాబ్ధాల సుధీర్ఘంగా కాపాడుకుంటూ వస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. రాజకీయంగా ముఖ్యమంత్రిగా ఉంటూ దేశవిదేశాలు తిరుగు తూ, తను, తనకుటుంబ, తన బంధుజనుల, చివరకు తన కులజనుల శ్రేయస్సే  ప్రధానంగా పని చేస్తూ ...సంపాదించిన సొమ్ములో రాజకీయ ఎన్నికల అవసరాలు తీర్చుకుంటూ, శాసన న్యాయ అధికార రాజ్యాంగ వ్యవస్థలపై ఉడుంపట్టుతో వాటిని జారిపోకుండా కాపాడుతూ వస్తున్నారు.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

వీళ్ల అహంకారం, ఆహం, స్వభావంతోనే తెలుగు రాష్ట్రం నిట్టనిలువునా చీలిపోయింది. తెలంగాణా ఏర్పడ్దాక ఇదే దారిలో మరో కులాధిపత్య అధికార కేంద్రాన్ని సృష్టించారు కలవకుంట్ల చంద్రశేఖరరావు. ఇది ఇంకా సంకుచితంగా మారి కుటుంబ బంధుజనుల అధికార కేంద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కమ్మ సామాజిక వర్గం ఎవరికీ అందనంత ఎత్తుకు అటు రాజకీయంగా ఇటు ఆర్ధికంగా ఎదిగిపోతుండగా తెలంగాణాలో వెలమ సమాజిక వర్గంతో పాటు కెసిఆర్ కుటుంబం రాజకీయ అర్ధిక పథంలో నింగినే అంటింది.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

వ్యక్తి, కుటుంబం, బంధుగణం, కులం, పార్టీ గతంగా రాజకీయం బాసటగా ఆధిక విజయాలే వెన్నుముకలా ఎదిగిపోతుండగా మిగిలిన జనం నిర్వీర్యమై దేశ పేదరికంలో మునిగి అధికజనులు అన్ని రంగాల్లో బలహీనులుగా మిగిలిపోతున్నారు. చంద్రబాబు, కెసిఆర్ లపై దాడి రాష్ట్రాలపై దాడులుగా అభివర్ణిస్తూ ఆ రాజకీయ వటవృక్షం నీడలో ఎదిగి పోతున్నారు.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneetiరాష్ట్రంలో లక్ష్యం వైసిపి:

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయనే అంటున్నారు విశ్లేషకులు. ఈ ఘటనపై తొలుత ఆ రాష్ట్ర డీజీపీ, ఆ తరవాత ముఖ్యమంత్రి, స్పందించిన తీరు ఇప్పటికే దర్యాప్తును తీవ్ర ప్రభావితం చేసే విధంగా ఉండగా, సిఎం  అడుగు ముందుకేసి మొత్తం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత శనివారం నాడు ఢిల్లీ వెళ్లి అక్కడ మీడియా సమావేశం లో మాట్లాడిన తీరు మొత్తం అలాగే కొనసాగింది. జగన్మోహనరెడ్డిపై విమానా శ్రయంలో దాడి జరిగితే మమ్మల్నెందుకు నిందిస్తారంటూ, కేసును పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన లో కేంద్రం విఫలమైతే మాపై ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించారు.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

శనివారం ఢిల్లీ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు, ఎవరు అడక్కుండానే వైఎస్‌ జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం సంఘటన గురించి చంద్రబాబు మూడుసార్లు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదా లో ఉన్న చంద్రబాబు తన బాధ్యతను విస్మరించి కేసు విచారణ, దర్యాప్తును తీవ్ర ప్రభావితం చేసే విధంగా మరోసారి తన సహజ ధోరణిని బయటపెట్టుకున్నారు.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

జగన్మోహనరెడ్డిపై దాడి ఘటనను మీడియా సమావేశంలో ఆయనే ప్రస్తావిస్తూ దాడికి వాడింది చిన్న కత్తి అని అంటూ, వైఎస్ జగన్మోహనరెడ్డి పై జరిగిన హత్యాయత్నం ఘటనను చంద్రబాబు తేలిక చేసి చెప్పారు. అలాగే వైఎస్ జగన్మోహనరెడ్డిపై అయింది చిన్న గాయమేనన్నారు. "వాడింది చిన్న కత్తి... అయింది చిన్న గాయం... జరిగింది విమానాశ్రయం... విమానాశ్రయం సీఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉంది... దీనిపై నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ" ప్రశ్నించారు.


దాడి జరిగిన తర్వాత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎందుకు హైదరాబాద్ వెళ్లిపోయారు? హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారని చెప్పారు. ఈ ఘటన తర్వాత రాష్ట్ర డీజీపీకి గవర్నర్ ఫోన్ చేసి విషయాలను అడగటమేమిటి? అని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వపరిపాలనా వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకుంటారు? అని ప్రశ్నించారు. పైగా గవర్నర్ ఢిల్లీకి వచ్చి కేంద్రానికి నివేదిక అందిస్తారా? దీనిపై బీజేపీ నేతలు మాపై విమర్శలు చేస్తారా? అంటూ మొత్తం హత్యాయత్నం ఘటనను వక్రీకరించే ప్రయత్నం చేశారు.


ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

హత్యయత్నానికి పాల్పడిన యువకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి అభిమానే అని చెప్పడానికి చంద్రబాబు ఈ సందర్భంగా మరోసారి ప్రయత్నం చేశారు. దాడి చేసిన వ్యక్తి జగన్మోహనరెడ్డి పక్క పక్కనే ఉన్నట్టు ఒక ఫ్లెక్సీ సృష్టించి అసలు దోషులను పట్టుకోకుండా దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్న ముఖ్యమంత్రి ఫ్లెక్సీలో లేని విషయాన్ని ఈరోజు ఢిల్లీలో వెల్లడించడం గమనార్హం. ఆ ఫ్లెక్సీ జనవరి ఒకటవ తేదీన వేశారని చంద్రబాబు చెప్పారు. జనవరి ఒకటిన వేశారన్న విషయం ఆయన ఒక్కరికే ఎలా తెలి సింది? అనేది ఆయన చెప్పనేలేదు. జనవరి ఒకటని ఆ ఫ్లెక్సీ మీద ఎక్కడా లేకపోగా, ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఆ మాట చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

వైఎస్ జగన్మోహనరెడ్డి పై జరిగిన హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడిన చంద్రబాబు మరో ముందడుగు వేసి "ఆపరేషన్ గరుడ" లో చెప్పినట్టే జరుగుతోందని అన్నారు. దీన్నిబట్టి ఒక ముఖ్యమంత్రి ఒక చట్టపరమైన అర్హతలేని సినిమా నటుడు, లేదా ఒక జ్యోతీష్కుడు చెప్పింది నమ్మి పనిచేస్తే ఆయన మానసిక స్థితి రాష్ట్ర పాలనకు ఎలా సరిపోతుంది.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

అయితే "ఆపరేషన్ గరుడ అంశం" పై విచారణ జరిపించకపోవడంపై సూటి గా సమాధానం చెప్పకుండా దాటవేశారు. "ఆపరేషన్ గరుడ" గురించి తొలిసారి శొంటినేని శివాజీ ప్రకటించి నప్పుడు దానిపై విచారణ జరిపించాలని అన్ని పక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో "చంద్రబాబే-ఆపరేషన్ గరుడ" అంశాన్ని ప్రస్తావించారు.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

నటుడు శివాజీ చెప్పిన "ఆపరేషన్ గరుడ" ప్రకారమే జరుగుతున్నాయని, ఏపీలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి తద్వారా జోక్యం చేసుకోవాలని కేంద్రప్రభుత్వం  ప్రయత్నిస్తుంది అని ఆరోపించారు. ఆపరేషన్ గరుడ అంశాన్ని ఒక విలేకరి లేవనెత్తుతూ, అధికారంలో ఉన్న మీరు ఎందుకు ఆ విషయంపై దర్యాప్తు జరిపించలేదని ప్రశ్నించారు. దానికి చంద్రబాబు ఇచ్చిన సమాధానం విస్మయపరుస్తోంది. "మీకు ఏదైనా సమాచారం తెలిసినప్పుడు అడిగితే సోర్స్ చెప్ప నంటావ్ కదా... !" అంటూ ఆపరేషన్ గరుడ విషయంలో శివాజీని విచారణ జరపాల్సిన అవసరం లేదన్నట్టు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఆ వెంటనే నాలుక కరుచుకుని లీగల్‌గా చేయాల్సింది చేస్తామంటూ దాటవేశారు. అయితే విచక్షణ ఉన్న పాత్రికేయ మిత్రులు సెటైరికల్గా "బ్రహ్మర్షి శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి - కాలఙ్జానం" ను రాష్ట్రానికి రాజ్యాంగంగా మార్చొచ్చని అంటున్నారు.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

రాష్ట్రం బయట లక్ష్యం టార్గెట్ బీజేపీ:

ఎన్డీయే ప్రభుత్వం టార్గెట్‌గా ఢిల్లీలో విమర్శలకు దిగిన చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం వరుస ట్వీట్లతో బీజేపీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే లక్ష్యంగా గత శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వరుసగా ఘాటైన ట్వీట్లు వది లారు. రాష్ట్రం పట్ల కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన, ఎన్నికల ముందు ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో మోదీ విఫలమయ్యారన్నారు.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

నోట్ల రద్దు వల్ల దేశంలోని ప్రతి పౌరుడూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శలు గుప్పించిన బాబు, జీఎస్టీని కూడా తప్పుబట్టారు. నల్లధనాన్ని వెనక్కి రప్పించడా నికి గత నాలుగేళ్ల లో నిజాయతీతో ఒక్క ప్రయత్నం కూడా చేయలేదంటూ, ఆయన ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు పై విమర్శలు ఉవ్వెత్తున గుప్పించారు. పెద్ద నోట్ల రద్ధుకు తానే సలహా ఇచ్చినట్లు - జిఎస్టి ని తానే సమర్ధించింది బాబు మరచినట్లుంది

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti

విజయ్ మాల్యా ₹9000 కోట్లు, నీరవ్ మోదీ ₹11500 కోట్లు, జతిన్ మెహతా ₹7000 కోట్లు, నితిన్ సందేసర ₹5000 వేల కోట్ల చొప్పున ఎగ్గొట్టారని చంద్రబాబు విమర్శించారు. గత నాలుగేళ్ల లో బీజేపీ సాధించిన విజయాలను ఈ మోసాలు మించిపోయాయని, బాబు మండిపడ్డారు. ప్రజల సొమ్ముతోవారు అంత తేలిగ్గా ఎలా పరారయ్యారంటూ చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. ఇందులో చంద్రబాబు తన మిత్రులను చేర్చలేదు.


చంద్రబాబు వదిలిన ట్విట్టర్ లలో:

*బీజేపీని వ్య‌తిరేకించే రాజ‌కీయ నాయ‌కుల‌పై దాడులు చేస్తున్నారు. మాట విన‌ని వ్యాపార వేత్త‌ల‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆఖ‌రికి మీడియా ను కూడా వ‌ద‌ల‌డంలేదు. వ్య‌వ‌స్థ‌ల‌ న్నిటినీ కుప్ప‌ కూల్చేశారు. ప్ర‌జాస్వామ్యాన్ని ప్ర‌మాదంలోకి నెట్టేశారు. అనేక రాష్ట్రాల్లో ఇదే జ‌రుగుతోందంటూ ఏపీ సీఎం మరో ట్వీట్ చేశారు.

 

*బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు ఉండాలి. అదే ఫెడరలిజం. బీజేపీ ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తమకు అనుకూలంగా ఉంటే సహకరిస్తుంది. వ్యతి రేకిస్తే కక్షపూరితంగా రాష్ట్రాలు, వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తోంది’ అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ap-news-telangana-news-ap-cm-chandrababu-kutaneeti
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జయహో భారత్! కీలక పదవుల్లో భారతీయ అమెరికన్లు-ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నామినేషన్లు
యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
తగ్గిపోతున్న పురుషత్వం - సంతానోత్పత్తి తగ్గటానికి పురుషులే ప్రధాన కారణం
సామాన్యుని సణుగుడు: దొరవారూ! ఇది కరక్టేనా! మీకిది తగునా?
శాపగ్రస్త కర్ణుని చేతిలో ఆయుధాలు పనిచేయనట్లే - ఇక ఆయన చాణక్యం పనిచేయదట?
హర్షవర్ధన చౌదరి, గరుడ శివాజి పై - వైఎస్ జగన్  హత్యయత్నం కేసులో - విచారణ?
నేను రాజకీయాలు చేయటానికే వచ్చా! టిడిపికి ఎవరు ఎదురెళ్ళినా వారు మోడీ ఏజెంట్లే! తలసాని
షర్మిల పిర్యాదు తో నాకేం సంబంధం? చంద్రబాబు కౌంటర్
కప్పల తక్కెడ రాజకీయం కర్ణాటకలో....అలా మొదలైంది!
పవన్ కళ్యాన్ సంగతేంటి?
ఎడిటోరియల్: ఎన్టీఆర్ బయోపిక్ వసూళ్ల వైఫల్యం - ఎన్నికల్లో టిడిపి పరిస్థితికి సంకేతమా?
విజువల్లీ ఛాలెంజెడ్ పాత్రలో స్వీటీ అనుష్క మరో రాం చరణ్ కావాలనా?
వాళ్ళు నేరస్తులే-వాళ్ళకు బలహీన కేంద్రం కావాలి-ప్రధాని మోడీ
కేసీఆర్ చంద్రబాబుకు ఇచ్చే రిటర్న్-గిఫ్ట్ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంది ప్రస్థావన
కులసంఘాలు, స్నేహితుల పేరుతో చంద్రబాబుకు భారీ రిటన్-గిఫ్ట్! ఎన్నికలే ఆలస్యం
ప్రభాస్ - షర్మిల సంబంధంపై పిర్యాదు చేసిన షర్మిల - దీనిలో టిడిపి హస్తం ఉంది
జగన్ పై హత్యయత్నం నేపధ్యంలో ఉన్నది ఆయనేనా?
ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాను బ‌య్య‌ర్ల‌కు "ఉచితం" గా ఇచ్చేస్తున్నారా?
About the author