సరిగ్గా వారం క్రితం విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగింది. దాంతో జగన్ గాయంతోనే హైదారాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. కత్తితో నిందితుడు, విశాఖ ఎయిర్ పోర్ట్ వెయిటర్ స్రీనివాసరావు గాయపరచిన భుజానికి తొమ్మిది కుట్లు వేసి ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోమన్నారు. అయితే వారం మాత్రమే విశ్రాంతి తీసుకున్న జగన్ పాదయాత్రకు మళ్ళీ రెడీ అయిపోయారు.


ఘన స్వాగతం :


వైఎస్ జగన్ కి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడానికి పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకుని జగన్ క్షేమంగా వస్తున్నందుకు పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు జగన్ ని కలసేందుకు  వస్తున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయం వైసీపీ నేతల హడావుడితో సందడి చేయనుంది.


అక్కడ నుంచే :


3వ తేదీ నుంచి సాలూరు నియోజకవర్గం మక్కువ నుంచి జగన్ తిరిగి తన పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఆయన అక్టోబర్ 25న ఇక్కడ పాదయత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్ పయనమయ్యారు. మక్కువ ప్రజలు సైతం జగన్ పై హత్యాయత్నం వార్త విని షాక్ తిన్నారు. తమ నాయకుడు మళ్ళీ ఇక్కడకే వస్తున్నారని తెలిసి వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ని చూసేందుకు జనం పోటెత్తే అవకాశాలు ఉన్నాయి.


ఏడాది సంబరాలు :


ఇక జగన్ పాదయాత్ర ప్రారంభించి ఈ నెల 6 నాటికి ఏడాది పూర్తి అవుతుంది. ఆ రోజున అయాన విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఉంటారు. అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా పాదయాత్ర విజయవంతంగా సాగినందుకు సంబరాలు చేసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ నెల 10న జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచ్ దాదాపు యాభై రోజుల పాతు అంటే ఈ డిసెంబర్ నెలాఖరు వరకూ జగన్ పాదయాత్ర చేయనున్నారు.


భద్రత పెంపు :


హత్యాయత్నం తరువాత తిరిగి పాదయాత్ర చేపడుతున్న జగన్ కి కట్టుదిట్టమైన భద్రతను పార్టీ పరంగా చేస్తున్నారు. జగన్ వ్యక్తిగత సెక్యూరిటీని యాభై మంది వరకూ పెంచుతున్నారు. అలాగే మరింత నిఘాతో, రక్షణతో జగన్ పాదయాత్ర సాగనుంది. జగన్ ఈ సందర్భంగా జనాలకు ఏం చెబుతారన్నది ఆసక్తిగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: