జగన్ మీద దాడి జరిగి వారం రోజులు దాటి పోయింది . అయితే జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడిన టీడీపీ ఉన్న పరువు పోగొట్టుకున్నది అయితే జగన్ మాత్రం ఎక్కడ నోరు జారలేదు.  వాస్తవానికి జగన్ కు కూడా కాస్త దూకుడెక్కువ. కానీ ఈ నాలుగున్నరేళ్ల సమయంలో ఆయనలో ఎక్కడలేని పరిణతి కనిపిస్తోంది. ప్రతి ఘటనను లోతుగా విశ్లేషించి మరీ నిర్ణయం తీసుకునే నేర్పు వచ్చింది. అందుకే కోర్టు తలుపు తట్టడానికి ఆయన వారం వెయిట్ చేశారు. తనపై దాడి జరిగిన వెంటనే ఇది అధికార పక్షం కుట్ర అనడం ఎంతో తేలిక. కానీ జగన్ ఎక్కడా నోరు జారలేదు.

Image result for jagan

దాడి జరిగిన తొలిరోజు దిగులుపడొద్దంటూ అభిమానులకు ట్విట్టర్ సందేశమిచ్చారు., తర్వాత తన దగ్గర స్టేట్ మెంట్ తీసుకోడానికి వచ్చిన పోలీసులతో మీపై నాకు నమ్మకం లేదని తిప్పి పంపించేశారు. చివరకు అక్టోబర్ 31 బుధవారం రోజున దాడి కేసు విచారణను నిష్పాక్షికంగా, పారదర్శకంగా దర్యాప్తు చేయాలని, స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని హైకోర్టుని కోరారు. ఈ వారం రోజుల్లో జరిగిన పరిణామాలను తన పిటిషన్ లో వివరించారు జగన్.

Image result for jagan

దాడి జరిగిన వెంటనే చంద్రబాబు, డీజీపీ సహా ఇతరులు చేసిన వ్యాఖ్యలను, ఆపరేషన్ గరుడ పేరుతో వచ్చిన వార్తలను ఇందులో ప్రస్తావించారు. దాడిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని, తాను అప్రమత్తంగా లేకపోతే కత్తి గొంతులో దిగేదని పిటిషన్లో పేర్కొన్నారు జగన్. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశిస్తుందా లేదా అన్నది తర్వాతి విషయం. ముందు జగన్ తాను చెప్పదలచుకున్న విషయాన్ని కోర్టు వేదికగా ప్రజల ముందుంచారు. ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారో తెలియక ముందే వారంరోజుల్లో టీడీపీ ఎన్ని డ్రామాలాడిందీ, ఎలాంటి నీచ రాజకీయాలు చేసిందీ జగన్ వివరించే ప్రయత్నం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: