Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 6:43 pm IST

Menu &Sections

Search

జగన్ కేసులో అదే జరిగితే టీడీపీ పరిస్థితి ఏంటి..!

జగన్ కేసులో అదే జరిగితే టీడీపీ పరిస్థితి ఏంటి..!
జగన్ కేసులో అదే జరిగితే టీడీపీ పరిస్థితి ఏంటి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్ తన మీద జరిగిన దాడి ని విచారణ చేయడం కోసం  స్వతంత్ర దర్యాప్తు ను నియమించమని కోర్ట్ ను ఆశ్రయించిన సంగతీ తెలిసిందే. ఈ వారం రోజుల్లో జరిగిన పరిణామాలను తన పిటిషన్ లో వివరించారు జగన్. దాడి జరిగిన వెంటనే చంద్రబాబు, డీజీపీ సహా ఇతరులు చేసిన వ్యాఖ్యలను, ఆపరేషన్ గరుడ పేరుతో వచ్చిన వార్తలను ఇందులో ప్రస్తావించారు. దాడిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని, తాను అప్రమత్తంగా లేకపోతే కత్తి గొంతులో దిగేదని పిటిషన్లో పేర్కొన్నారు జగన్.

tdp-ysrcp-jagan

స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశిస్తుందా లేదా అన్నది తర్వాతి విషయం. ముందు జగన్ తాను చెప్పదలచుకున్న విషయాన్ని కోర్టు వేదికగా ప్రజల ముందుంచారు. ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారో తెలియక ముందే వారంరోజుల్లో టీడీపీ ఎన్ని డ్రామాలాడిందీ, ఎలాంటి నీచ రాజకీయాలు చేసిందీ జగన్ వివరించే ప్రయత్నం చేశారు. పిటిషన్ పై విచారణ జరపనున్న కోర్టు, స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే జగన్ తొలి విజయం సాధించినట్టే. అది కచ్చితంగా టీడీపీ ప్రభుత్వానికి చెంపదెబ్బలా తగులుతుంది. విచారణ జరక్కముందే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, డీజీపీ హడావుడిగా చేసిన వ్యాఖ్యలు సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి.

tdp-ysrcp-jagan

చివరకు నిందితుడు శ్రీనివాసరావు తనకు ప్రాణహాని ఉందని మీడియా ముందు హడావుడి చేయడం, పిచ్చిపిచ్చిగా మాట్లాడ్డం కూడా ఓ పథకం ప్రకారం జరిగినవేనని చెప్పాలి. అతడి కాల్ డేటా విశ్లేషిస్తే విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయని సమాచారమందుతోంది. ఇలాంటి టైమ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలీసు వ్యవస్థతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏమేరకు ఈ వాస్తవాలను బైటకు తెస్తుంది. అధికార పార్టీతో అంటకాగే డీజీపీ వాస్తవాల్ని తొక్కిపెట్టరని గ్యారెంటీ ఏంటి? అనే సందేహాలు వస్తున్నాయి.

tdp-ysrcp-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author