చంద్ర బాబు పూటకో మాట రోజుకో మాట మార్చడం లో ఎవరైనా బాబు తరువాతే నని ఒప్పుకోవాల్సిందే. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రారంభోత్సవంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జగన్ మీద ఆయనే హత్యాయత్నం చేయించుకున్నాడు అని తాను అనడం లేదని చెప్పుకొచ్చాడు.జగన్ మీద అటాక్ చేయించుకున్నది జగన్ కాదని బాబు సర్టిఫికెట్ ఇచ్చాడు. అది వేరే  వాళ్ల పని అని బాబు చెప్పుకొచ్చాడు. పరోక్షంగా బీజేపీ వాళ్లు ఈ పని చేయించారు అని బాబు వ్యాఖ్యానించాడు. జగన్ మీద వాళ్లు అటాక్ చేయించి ఉండవచ్చు అని బాబు చెప్పుకొచ్చాడు.


ఆఫ్ ది రికార్డు: జగన్ విషయం లో చంద్ర బాబు అహంకారం ఎక్కువైంది.. టీడీపీ నేతలు ఆవేదన...!

ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ విచారణకు ఒప్పుకునేది కూడా లేదని బాబు తేల్చేశాడు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ విచారణ జరిగితే.. ఆ దాడి తాము చేయించామని తమపై బురదజల్లుతారని బాబు అన్నాడు. కేంద్ర ప్రభుత్వ విచారణ జరిగితే.. అది తెలుగుదేశం పార్టీని దోషిగా నిలిపేయత్నం చేస్తుందని బాబు ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. ఓవరాల్ గా జగన్ మీద అటాక్ చేయించింది బీజేపీ అన్నట్టుగా.. కేంద్ర ప్రభుత్వ విచారణకు తాము ఒప్పుకోమని బాబు చెప్పేశాడు.

జగన్ దాడి చేయించుకోలేదుః చంద్రబాబు

ఇదీ చంద్రబాబు తాజా వాదన. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ విచారణను చంద్రబాబు నమ్మను అంటున్నాడు. మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణను నమ్మేది ఎలా? కేంద్రం ధర్యాప్తు చేస్తే తమను దోషిగా చూపుతుందన్నట్టుగా బాబు ఓపెన్ గానే  చెబుతున్నాడు. అంతే భయం ఎందుకు? మరి రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే తమ శత్రువులను దోషిగా చూపవచ్చు కదా! జగన్ మీద అటాక్ విషయంలో బాబు ఇలా కొత్త మాటలు మాట్లాడుతున్నాడు. ఈ వ్యవహారంలో ముందు ముందు ఇంకా ఏమేం మాట్లాడతాడో!

మరింత సమాచారం తెలుసుకోండి: