కాంగ్రెస్ వ్యతిరేకత నుండే పుట్టిన తెలుగుదేశంపార్టీ చివరకు అదే కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవటాన్ని మెజారిటీ తమ్ముళ్ళు వ్యతిరేకిస్తున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. రేపో మాపో ఏపిలో కూడా పొత్తుల విషయంపై నిర్ణయం వచ్చేస్తుంది. ఇప్పటికైతే ఏపిలో కాంగ్రెస్ తో పొత్తులుండదని నేతలకు జోల పాడుతున్న చంద్రబాబు మెల్లిగా అసలు విషయం చెబుతారు. చారిత్రక అవసరం దృష్ట్యా కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవాల్సొస్తోందని చెబుతున్నారు.

 

దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటం కోసమే బిజెపియేతర పార్టీలను కలుపుకుని పోవాలంటున్నారు చంద్రబాబు. అంటే తాను ఏమనుకుంటే అదే విషయాన్ని నేతల మెదళ్ళల్లోకి ఎక్కిస్తారు. పోయిన ఎన్నికల్లో వైసిపికి వేసే ప్రతీ ఓటు రాహూల్ గాంధికి వేసినట్లే అని చెప్పారు. ఇపుడేమో బిజెపి, వైసిపిలు కలిసి తనపై కుట్రలు చేస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి వేసే ప్రతీ ఓటు నరేంద్రమోడికి వేసినట్లే అవుతుందని చెబుతున్నారు. అప్పట్లో తాను బిజెపితో పొత్తుపెట్టుకుంటే బిజెపి మంచిది. ఇపుడు కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుంటే కాంగ్రెస్ మంచిది.

 

పొత్తుల విషయంలో చంద్రబాబుకు సొంత అజెండా తప్ప ఇంకోటి లేదనే విషయం ఎప్పుడో అర్ధమైపోయింది. దానికే చారిత్రాత్మక అవసరమని, ప్రజాస్వామ్య పరిరక్షణ అని ఏదో పడికట్టు పదాలు చెబుతుంటారు. చంద్రబాబు వైఖరితో చాలామంది నేతలు విసిగిపోయినట్లు సమాచారం. పైకి చంద్రబాబు ఎదుట తమ అభిప్రాయాలు చెప్పలేకపోతున్నా లోలోపల మాత్రం బాగా గుర్రుగా ఉన్నారు.

 

ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు తెలుగుదేశంలో చేరిన ఎన్టీయార్ అభిమానులెవరూ చంద్రబాబు పోకడలను సహించలేకున్నారు. కాకపోతే ఇపుడు ఎందుకు మాట్లాడటం లేదంటే రేపటి ఎన్నికల్లో టిక్కెట్ల కోసమని చెప్పాలి. రేపటి ఎన్నికల్లో టిక్కెట్లు రావని తీర్మానించుకున్నవారు, టిక్కెట్లు పట్టింపు లేని వాళ్ళు మాత్రం చంద్రబాబు వైఖరిపై మండిపోతున్నట్లు సమాచారం. సమయం చూసి చంద్రబాబుకు షాకివ్వటానికి ఎవరికి వారు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మరి ఏమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: