మీ టూ ఉద్యయం ఊపందుకోవడం తో చాలా మంది హీరోయిన్స్ తమకు జరిగిన చేదు అనుభవాలను బయటికి చెబుతున్నారు. తాజాగా సాజిద్‌పై లిపిస్టిక్ అండర్ మై బుర్ఖా ఫేమ్ అహానా కుమ్రా దారుణమైన ఆరోపణలు చేసింది. తాజాగా జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అహానా సంచలన విషయాలు బయటపెట్టింది. వివరాల్లోకి వెళితే.. గతేడాది సాజిద్ ఖాన్‌తో నాకు చేదు అనుభవం ఎదురైంది. అతని చెత్త ప్రవర్తనతో షాక్ తిన్నాను.

హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం కష్టం

ఓ రోజు అతడిని కలుసుకోవడానికి వెళ్లాను. అతను నన్ను ఓ చీకటి గదిలోకి తీసుకెళ్లాడు. బయటకు వెళ్దామని చెప్పగా.. మా అమ్మకు డిస్ట్రబ్ అవుతుంది. ఇక్కడే కూర్చొందామని చెప్పడంతో నా మనసు ఏదో కీడు శంకించింది అని అహానా చెప్పింది. గదిలో చీకటి ఉండటంతో లైట్లు వేయమని చెప్పాను. నాతో ఎదో ఒకటి మాట్లాడటానికి ప్రయత్నించాడు. దాంతో మా అమ్మ పోలీస్ ఆఫీసర్. మీరు సరిగా ప్రవర్తించమని హెచ్చరించాను.

 సాజిద్ ప్రవర్తనను తప్పుపట్టి..

ఆ తర్వాత నాతో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఒకవేళ కుక్కతో సెక్స్ చేస్తే నీకు రూ.100 కోట్లు ఇస్తాను అని ఓ సాజిద్ ఓ ప్రశ్న అడిగాడు. సాజిద్ మాటలతో ఒక్కసారిగా సీరియస్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ నిలదీశాను. దాంతో సిల్లీ, సెక్సీ జోకులు వేసి నన్ను నవ్వించేందుకు ప్రయత్నించాడు. నా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని ఏదో చెప్పి మభ్య పెట్టేందుకు ప్రయత్నించాడు. అలాంటి ప్రవర్తనతో ఓ దశలో విసిగిపోయాను. 

మరింత సమాచారం తెలుసుకోండి: