జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల లో పాల్గొనడం లేదని ఇటీవల పేర్కొనడం జరిగింది. గతంలో తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించిన క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో సంతోషించారు.

Image result for kcr

అయితే ప్రస్తుతం ఎన్నికలు తరుముకొస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో క్యాడర్ కూడా లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైనే దృష్టి పెట్టి తెలంగాణ పట్ల అంతగా పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో నిరుత్సాహం చెందరు.

Image result for kcr pawan kalyan

ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకోవాలని ఓట్ల రూపంలో కొల్లగొట్టాలని... సరి కొత్త ప్లాన్ వేసినట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో టాక్ వినపడుతుంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఇటీవల పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మద్దతు కోరటం జరిగింది.

Image result for kcr pawan kalyan

అయితే కెసిఆర్ కోరిక మేరకు తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కి మరియు టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఎన్నికలలో ప్రచారం లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజం అయితే కేసీఆర్‌కు తిరుగులేని మెజార్టీతో గెలుస్తార‌ని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




మరింత సమాచారం తెలుసుకోండి: