టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు కాంగ్రెస్ తో కలిసి నడవాలని డిసైడ్ అయిపోయాడు. ఏ కాంగ్రెస్ మీద అయితే ప్రజలు కోపం తో రగిలి పోతున్నారో వారి తోనే బాబు దోస్తీ కట్టడం ఆంధ్ర ప్రదేశ్ లో అనూహ్య మార్పులకు కారణం అవుతుంది. టీడీపీ , కాంగ్రెస్ పొత్తు ఆంధ్ర లో జగన్ కు అఖండ విజయాన్ని చేకూర్చుతుందని లగటి పాటి బాబుకు చెప్పినట్టు సమాచారం...! అయితే  నిజానికి, చంద్రబాబు డీఎన్‌ఏలో కాంగ్రెస్‌ పార్టీ జాడలు కన్పిస్తాయి. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్‌ పార్టీ నుంచి.

Image result for jagan and chandrababu

ఆ తర్వాతే ఆయన టీడీపీలోకి వచ్చారు. పిల్లనిచ్చిన మామ నందమూరి తారకరామారావుని రాజకీయంగా వెన్నుపోటు పొడిచి, టీడీపీ పగ్గాలు లాక్కున్న చంద్రబాబు.. ఆ పార్టీని భ్రష్టుపట్టించేయడంలో శక్తి వంచన లేకుండా కృషిచేశారు. తెలంగాణలో నాలుగు సీట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీని తాకట్టు పెట్టేసిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లోనూ టీడీపీకి మరణశాసనం రాసేశారన్నమాట.. రాహుల్‌తో భేటీ పుణ్యమా అని.

Image result for jagan and chandrababu

టీడీపీ - కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే, 'ఆత్మహత్య చేసుకుంటా..' అని ఓ టీడీపీ ముఖ్యనేత సెలవిచ్చారు ఈ మధ్యనే. ఆయన ప్రభుత్వంలో అతి కీలకమైన పదవిలో వున్నారు. చంద్రబాబు - రాహుల్‌తో భేటీ అయ్యాక ఆ ముఖ్యనేత ఏం చేస్తారో ఏమోనని సదరునేత అనుచరగణం తీవ్ర ఆందోళన చెందుతోంది. దేశ ప్రయోజనాల కోసం..' అంటూ చంద్రబాబు కథలు చెప్పుకోవచ్చుగాక.. కానీ, స్వర్గీయ నందమూరి తారకరామారావుకీ, తెలుగు జాతికీ అసలు సిసలు 'వెన్నుపోటు' చంద్రబాబు ఇదిగో.. ఇప్పుడే పొడిచారన్నది మెజార్టీ అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: