గడచిన వారం రోజులుగా 45 సంవత్సరాల యువనేత 40 సంవత్సరాల ఇండస్ట్రీని పరుగులు పెట్టిస్తున్నారు. ఏ ముహూర్తంలో వైసిపి ట్రాప్ లో చంద్రబాబునాయుడు పడిపోయారని నరేంద్రమోడి పార్లమెంటులో అన్నారో తెలీదుకానీ ఆ మాట మాత్రం నిజమే అనిపిస్తోంది.  పైగా మీడియా సమావేశంలో, బహిరంగ సభల్లో మాట్లాడుతూ తాను వైసిపి ట్రాప్ లో పడ్డారని మోడి అనటం ఎంతవరకూ సమంజసమో చెప్పండి తమ్ముళ్ళూ అంటూ ఒకటికి పదిసార్లు అడుగుతున్నారు. అంటే తనకు తెలీకుండానే చంద్రబాబు వైసిపి ట్రాప్ లో పడిపోరాయని అర్ధమైపోతోంది.

 

ఎలాగంటే,  వారం క్రితం విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే జగన్ పై దాడి జరిగిందో అప్పటి నుండి చంద్రబాబు హత్యాయత్నం ఘటన గురించే మాట్లాడుతున్నారు. గడచిన వారం రోజులుగా జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి చంద్రబాబు దగ్గర నుండి టిడిపి నేతల వరకూ సుమారు 60 మీడియా సమావేశాల్లో మాట్లాడారట. ఎన్ని మీడియా సమావేశాల్లో మాట్లాడినా తమ వాదనకు తగిన ఆధారాలైతే చూపలేకపోతున్నారు. పోనీ జగన్ ది డ్రామానే అనుకున్నా ఆ డ్రామాను కూడా నిరూపించలేకపోతున్నారు. దాంతో జగన్ పై జరిగింది నిజంగా హత్యాయత్నమే అని జనాలు కూడా నమ్ముతున్నారు.

 

గడచిన వారం రోజులుగా పార్టీ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్సులు, సమీక్షా సమావేశాలు, బహిరంగసభలు ఇలా ఎక్కడ మాట్లాడినా జగన్ పై జరిగిన హత్యాయత్నాన్నే చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో చాలదన్నట్లుగా ఢిల్లీకి వెళ్ళి మీడియా సమావేశంలో జగన్  విషయాన్నే మాట్లాడారు. మళ్ళీ ఈరోజు జాతీయ నేతలను కలవటానికి ఢిల్లీకి వెళుతున్నారు. అంటే ఇపుడు కూడా జగన్ విషయమే చర్చిస్తారనటంలో సందేహం లేదు.

 

హత్యాయత్నంలో గాయపడిన జగన్ ఏమో ప్రశాంతంగా ఉన్నారు. హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబేమో ఒకటికి పదిసార్లు హత్యాయత్నం ఘటనపైనే మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు గురించి నరేంద్రమోడి చెప్పింది అక్షరాల నిజమే అని అనిపించటం లేదూ. మొత్తానికి 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును 40ల్లో ఉన్న జగన్ బాగానే పరుగులుపెట్టిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: