ఒకదాన్ని చిన్న గీత చేయాలంటే పక్కన మరో పెద్ద గీత గీయాలి. తెలివైన వారు అలాగే చేస్తారు రాజకీయాల్లో ఉన్న వారు కూడా ఏది తమకు అనుకూలమో చూసుకుని మరీ పావులు కదుపుతూంటారు. తమకు ఇష్టం లేనివి ఏవైనా ఉంటే రాజకీయ తెరపై నుంచి తొందరగా పక్కకు తొలగిపోవాలనుకుంటారు. దానికి అనుగుణంగా చర్యలూ చేపడతారు. 


జగన్ హత్యాయత్నం కేసు :


గత వారంగా ఏపీ రాజకీయాల్లో జగన్ హత్యాయత్నం కేసు ఓ కుదుపు కుదుపుతోంది. దాని వల్ల అధికార పక్షమైన తెలుగుదేశం ఇరకాటంలో పడుతోంది. ఎంత డిఫెన్స్ చేసుకున్నా జనంలోకి ఆ అంశం బలంగా వెళ్ళిపోయింది. ఓ ప్రధాన ప్రతిపక్ష నాయకుని మీద హత్యాప్రయత్నం జరగడం ఒక ఎత్తు అయితే దాని మీద టీడీపీ చేసిన యాగీ రాజకీయం మరో ఎత్తు. మొత్తానికి చూసుకుంటే తమ్ముళ్ళ వ్యూహం బూమరాంగ్ అయింది. జనంలోనూ చెడ్డ పేరు వస్తోంది.


అర్జంట్ గా మాయం :


మరి ఇరుకున పెట్టే ఈ కేసును అర్జంట్ గా జనం మెదళ్ళ నుంచి తాత్కాలికంగానైన మాయం చేయాలి. అలా చేయాలంటే దాని కంటే పెద్ద అంశం తెర మీదకు రావాలి. అందుకే ఉన్నఫళంగా చంద్రబాబు డిల్లీ పయనం కట్టడం. జాతీయ కూటమి అంటూ హడావుడి స్రుష్టించడం. ఎటూ బాబు చేతిలో అనుకూల మీడియా ఉండనే ఉంది. దాంతో ఇది కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్ గా జనంలో నానుతుంది. జగన్ హత్యాయత్నం కేసు ఇపుడు మరుగున పడిపోయింది.


ఫలించిన వ్యూహం :


అనుకున్నట్లుగానే బాబు వ్యూహం ఫలించింది. రోజంతా కాంగ్రెస్, టీడీపీ కలయిక, జాతీయ రాజకీయలు ఇవే దాదాపుగా అన్ని చానళ్ళ‌లోనూ డిబేట్ గా వచ్చాయి. ఆఖరుకు జగన్ కు సంబంధించిన సాక్షి మీడియా సైతం ఇదే అంశాంపై చర్చ పెట్టకతప్పలేదు. మొత్తానికి తాను ఏదైతే అనుకున్నారో అది సాధించి బాబు సక్సెస్ అయ్యారు. ఇకపై రోజూ బాబు డిల్లీ రాజకీయాలు, టూర్లు ఇవే హైలెట్ అయ్యేలాగే కొన్నాళ్ళ పాటు న్యూస్ చూడొచ్చు. మరో వైపు డిల్లీలో వైసీపీకి ప్రతిపక్షాల మాట సాయం కూడా లేకుండా చేయడంలోనూ బాబు విజయవంతం అయ్యారు. దటీజ్ చంద్రబాబు అనిపించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: