చంద్రబాబునాయుడుకు చెడ్డ రోజులు మొదలైనట్లే కనిపిస్తోంది. ఓటుకునోటు కేసును ఫిబ్రవరి నెలలో విచారణకు సుప్రింకోర్టు స్వీకరించింది. కేసు విచారణపై ఇంత కాలం అసలు వాదనలే జరగకుండా అడ్డుకుంటున్నారు. అటువంటిది ఈరోజు జరిగిన విచారణలో కేసులో మెరిట్ ఉంది కాబట్టి వచ్చే ఫిబ్రవరిలో కేసును రెగ్యులర్ గా విచారించాలని సుప్రిం నిర్ణయించింది. దాంతో చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేట్లు లేదు. కేసును విచారణకు అర్హత లేదని టిడిపి తరపున లాయర్లు వాదించారు. అయినా కోర్టు వారి వాదనతో అంగీకరించలేదు.

 Image result for vote for cash

ఫిబ్రవరిలో అంటే ఎన్నికలుంటాయని, పిటీషన్ కూడా కక్షపూరితంగా వేశారంటూ టిడిపి లాయర్లు విచారణను అడ్డుకునేందుకు చాలా ప్రయత్నించారు. కానీ సుప్రింకోర్టు టిడిపి లాయర్ల వాదనతో ఏకీభవించలేదు. ఓటుకునోటు కేసులో సూత్రదారి, ప్రధాన ముద్దాయి చంద్రబాబునాయుడే అంటూ వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసు వేశారు. అందుకే తమపై కక్ష సాధింపంటూ టిడిపి లాయర్లు వాదించారు. కేసున విచారించిన న్యాయమూర్తి  మాట్లాడుతూ ఎన్నికలకు కేసు విచారణకు ఏమీ సంబంధం లేదని తేల్చేశారు. అదే విధంగా కక్షసాధింపు విషయమై మాట్లాడుతూ, కేసులో మెరిట్ ఉందా లేదా అన్నది మాత్రమే తాము చూస్తామని స్పష్టం చేశారు. కేసులో మెరిట్ ఉందని భావించబట్టే కేసు విచారణను రెగ్యులర్ గా ఫిబ్రవరి నుండి విచారిస్తామని తేల్చి చెప్పారు.

Related image

పోయిన ఎన్నికల్లో అధికారంలోకి రాగానే తెలంగాణాలో జరిగిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ తో రూ 5 కోట్లకు బేరం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. బేరంలో భాగంగా అడ్వాన్సు ఇచ్చేందుకు రూ 50 లక్షలు తీసుకుని స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్ళినపుడు రేవంత్ రెడ్డి రెడ్డహ్యాండెడ్ గా పట్టుపడ్డారు. రేవంత్ ను డబ్బులతో తెలంగాణా ఏసిబి పట్టుకుంది. అప్పటి నుండి ఈ కేసు చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతోంది. ఒకసారి కేసు విచారణ మొదలైతే సుప్రింకోర్టే కేసును విచారిస్తుందా ? లేకపోతే సిబిఐని విచారించమని ఆదేశిస్తుందా ? అన్నది తేలుతుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: