చంద్ర బాబు కాంగ్రెస్ జట్టు కట్టడటం కొంత మంది టీడీపీ నాయకులకు అస్సలు ఇష్టం లేదు దానితో పాటు టీడీపీ మునిగే నావ కాబట్టి ఎప్పుడెప్పుడు జంప్ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఒక మంచి కారణం దొరికింది వీరికి.  2019 ఎన్నికల్లో టీడీపీ మునిగిపోయే నావ అని తెలిసిన నేతలు పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సరైన కారణం కోసం ఎదురు చూస్తున్న వీరందరికీ కాంగ్రెస్-టీడీపీ అపవిత్ర పొత్తు కలిసొచ్చింది. అక్కడ కలయిక పూర్తికాగానే, ఇక్కడ కదలిక మొదలైంది. కారణం లేకుండా పార్టీమారితే జనంలో కాస్తో కూస్తో ఇమేజి డ్యామేజ్ అవుతుంది.


జగన్ దాడి విషయం లో నేను ఎప్పుడు అన్నాను .... మళ్ళీ మాట మార్చిన చంద్ర బాబు నాయుడు...!

ప్రభుత్వంలో ఉండి, పదవులు అనుభవించి, అభివృద్ధి చేయడం చేతకాక ఇప్పుడు పార్టీ మారారన్న అపవాదు ఉంటుంది. కానీ ఇప్పుడా ప్రతికూలతలు లేవు. టీడీపీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్న వాళ్లెవరైనా ధైర్యంగా గీతదాటొచ్చు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ చివరికి దానికే దాసోహం అనాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి తాము పార్టీలో ఉండలేమని, మనస్సాక్షిని చంపుకోలేమని రకరకాల నీతికథలు చెప్పొచ్చు. అందుకే 13జిల్లాల నేతల్లో కదలిక వచ్చింది. ఒకరకంగా ఇది జగన్ కి తలనొప్పే అని చెప్పాలి. వలసల్ని ప్రోత్సహించే నైజం జగన్ కి లేకపోయినా పెద్ద తలకాయలు కోరి వస్తామంటే ఆయన మాత్రం కాదనగలరా.


జగన్ దాడి విషయం లో నేను ఎప్పుడు అన్నాను .... మళ్ళీ మాట మార్చిన చంద్ర బాబు నాయుడు...!

స్థానికంగా పట్టుకోసం అందర్నీ కలుపుకొని పోవాల్సిన పరిస్థితి. ఒకవేళ జగన్ కాదన్నా జనసేన ఉండనే ఉంది. పైగా నాయకత్వ లేమి స్పష్టంగా కనపడుతోంది. దీంతో జనసేనలోకి దూకడానికి టీడీపీ నేతలు సై అంటున్నారు. లీడర్లు లేక ఖాళీగా ఉన్న జనసేన కూడా ఇలాంటి టైమ్ కోసమే ఎదురు చూస్తోంది. మొత్తానికి బాబు నిర్ణయం టీడీపీ నాయకులకు దీపావళిని కాస్త ఎర్లీగా తీసుకొచ్చింది. పోతూ పోతూ చంద్రబాబుని ఎలా ఛీకొట్టాలా అని ఎదురుచూస్తున్న నాయక గణానికి ఆయనే మంచి అవకాశం ఇచ్చాడు. రోజుల వ్యవధిలోనే టీడీపీలో 'గీత' గోవిందం ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందనమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: