కత్తి మహేష్ జగన్ మీద జరిగిన దాడి గురించి చాలా ఘాటుగా స్పందించాడు. ప్రజా స్వామ్యం లో ఉండాల్సిన మనం ఎక్కడికి పోతున్నామని ఆవేదన చెందాడు. ఆయన మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ మీద హత్యాప్రయత్నం జరిగిన రోజునే లైవ్ లోకి వద్దాం అని అనుకున్నా.. కాని నిజా నిజాలు బయటకు రావాలి. అసలు ఏం జరిగిందో తెలియాలి. దానికోసం వేచిచూడాలి. మనం ఏం తెలియకుండా ఏం మాట్లాడగలం ఖండించడం తప్ప అని కొన్నాళ్లు ఆగాను.

Image result for kathi mahesh

కాని జరుగుతున్న పరిణామాలు చూస్తే.. చాలా ప్రమాదకరంగా మన ప్రజాస్వామ్యం ఉంది. ఈ హత్యారాజకీయాల నేపథ్యం ప్రజాస్వామ్యానికి హాని చేస్తుందనే అభిప్రాయం అయితే కలిగింది. ఈ విషయాన్నే షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంలో ఈ లైవ్ చేస్తున్నా. వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరగిందో అందరికీ తెలిసిందే. ఇలాంటివి జరిగినప్పుడు సాటి మనిషిగా ఎలా స్పందిస్తున్నాం.. రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తున్నారు అనేది లోతుగా గమనించాల్సిన విషయం. నిజానికి నాకు జగన్‌పై హత్యాయత్నంకంటే ఎక్కువ షాక్ ఇచ్చింది దాడిపై జనాలు, టీడీపీ నాయకుల రియాక్షన్. 

Image result for mlc rajendra prasad wiki

ఇక లోకేష్ కాని ఇతర మంత్రులు కాని ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ అనే టీడీపీ ఎమ్మెల్సీ ఎంత చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారంటే.. నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనుషుల మధ్య నివసిస్తున్నామా? అనే సందేహాన్ని కలిగించేవిగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. జగన్ తల్లి, చెల్లే జగన్‌పై హత్యాయత్నం చేయించారనే రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు వింటే.. ఎక్కడ నుండి వచ్చాడు ఈ జంతువు మన సమాజంలోకి అనే డౌట్ వస్తుంది. ఒక పార్టీపరంగా కాని.. వ్యక్తిగతంగా కాని జగన్ విషయంలో టీడీపీ నాయకులు స్పందించిన తీరు వాళ్లకు వాళ్లు చేసుకున్న డ్యామేజ్‌గా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: