రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం ఖాయంగా తోస్తోంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికి ఓట్లేస్తారు అనే అంశంపై ఇప్పటికే పలు మీడియా సంస్ధలు సర్వేలు జరిపిన  విషయం తెలిసిందే. తాజాగా సీ ఓటర్, రిపబ్లిక్ సంస్ధల సర్వేలో కూడా ప్రజలు వైసిపికి ఓట్లయటానికే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. సర్వేలో వెల్లడవుతున్న ప్రజానాడి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి అఖండ మెజారిటీ రావటం ఖాయమని తెలిసిపోతోంది. తాజా సర్వేలో మొత్తం 25 ఎంపి సీట్లకు గాను వైసిపి 20 సీట్లలో విజయం సాధిస్తుందని వెల్లడైందట.


ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అనే ప్రాతిపదికన పై రెండు సంస్ధలు సర్వే నిర్వహించాయి. వైసిపికి 20 సీట్లు వస్తాయని, టిడిపి 5 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని తేలిందట. అదే విధంగా తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లకు గాను కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి 8 సీట్లు, టిఆర్ఎస్ కు 7 సీట్లు వస్తాయని తేలింది.  కాగా బిజెపి,మజ్లిస్  చెరో సీటు గెలుస్తాయట. అయితే డిసెంబర్ లో జరగబోయే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాల్లో కాస్త తేడా ఉండవచ్చని కూడా సర్వే నివేదిక చెబుతోంది.


పోయిన ఎన్నికల్లో వైసిపికి 8 సీట్లు వచ్చాయన్న విషయం తెలిసిందే. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ముగ్గురు వైసిపి ఎంపిలను చంద్రబాబునాయుడు టిడిపిలోకి లాక్కున్నారు. పోయిన ఎన్నికల్లో రెండు స్ధానాలు గెలుచుకున్న బిజెపికి వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదని తేలిపోతోంది. ఇక మొదటిసారి ఎన్నికల్లో అరంగేట్రం చేద్దామనుకుంటున్న జనసేనకు కూడా నిరాశ తప్పేట్లులేదు. వైసిపికి 41.2 శాతం ఓట్లు వస్తాయని సర్వే నివేదిక చెబుతోంది. టిడిపికి 31.2 శాతం, బిజెపికి 11.3 శాతం, కాంగ్రెస్ కు 9.3 శాతం ఓట్లు దక్కుతాయట. జనసేనకు దక్కే ఓట్ల శాతం గురించి సర్వే ఎక్కడా పేర్కొనలేదు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: