రాజకీయాల్లో అన్ని వ్యూహాలు సక్సెస్ అవుతాయని ఏమీలేదు. అలాగే అన్ని కాలాలు కలసివస్తాయని కూడా లేదు. అదే జరిగితే ఏ పార్టీ కానీ, నాయకుడు కానీ ఓడిపోకూడదు. మరి మేమే తెలివైన వాళ్ళం అని నేతలు అనుకుంటే వారి కంటే తెలివైన వాళ్ళు తల రాతలు నిర్ణయించే ఓటర్లు. వారికి అన్నీ తెలుస్తాయి. కానీ గుట్టు విప్పరు. మాట ఛెప్పరు. . తీర్పు మాత్రం ఆటం బాంబులాగానే ఉంటుంది.


తెలుగు కాంగ్రెస్ :


కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే పార్టీ అంటూ అన్న గారు చైతన్య రధం పైన చేసిన ఆవేశ పూరిత ప్రసంగాలు  ఇంకా జనం చెవుల్లొ మారుమోగుతూనే ఉన్నాయి. ఇటలీ మాఫియా ఏపీని అడ్డగోలుగా విడదీసింది. పుట్టిన రోజు కానుకగా ఉమ్మడి ఏపీని రెండు ముక్కలు చేసింది. ఇటలీ మ్యాప్ లా ఏపీ ని కూడా చీల్చసింది. ఈ మాటలు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నవి. 


ఇవి ఇంకా బాగా జనానికి గుర్తు వున్నాయి. అన్నిటి  కంటే ఎక్కువగా కాంగ్రెస్ చసిన  విభజన పుణ్యమే ఇపుడు అనుభవిస్తున్న వేదన అన్నది కూడా జనానికి బాగా గుర్తుంది. అటువంటి కాంగ్రెస్ తో తెలుగుదేశం చేతులు కలిపితే ఊరుకుంటారా


యాంటీ   జనం జగన్ వైపే:


ఈ వ్యూహం వల్ల అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చునని చంద్రబాబు అనుకుంటున్నారు కానీ, జనల్లో మాత్రం రివర్స్ ఫీలింగ్ ఉంది. ఎటూ బాబు పాలన పట్ల వ్యతిరేకత ఉంది. దానికి తోడు అన్నట్లుగా కాంగ్రెస్ చేసిన విభజన పాపాన్ని కూడా నెత్తినేసుకుని ప్రచారానికి టీడీపీ బయల్దేరితే రెట్టింపు వ్యతిరేకత వస్తుందని విశ్లేషిస్తున్నారు.  అపుడు రెండు పార్టీల నుంచి వచ్చే వ్యతిరేకత జగన్ వైపుగా మళ్ళుతుందని, వైసీపీకి మరింత సానుకూలం అవుతుందని కూడా అంటున్నారు.


నెత్తిన పాలు :


జగన్, మోడీలకు చెక్ పెట్టే పొత్తు అని తమ్ముళ్ళు అంటున్నా అసలైన టీడీపీ అభిమానులు మాత్రం  ఈ పొత్తుతో చిత్తు అవుతామని భయపడుతున్నరు. టీడీపీ ఊపిరి కాంగ్రెస్ వ్యతిరేకత, అటువంటిది ఇపుడు ఆ పార్టీతో దోస్తీ కడితే అసలుకే ఎసరు వస్తుందని అంటున్నారు. ఇక జగన్ పై పెట్టిన కేసులు రెండు పార్టీలు కలసి పెట్టినవేనని ఇంతకాలం వైసీపీ చేసిన విమర్శలను కూడా నిజం చేసినట్లు అవుతుందని హడలిపోతున్నారు. 


మొత్తానికి ఈ పొత్తు వల్ల వైసీపీకి మేలు చేసినట్లేనని అసలైన తమ్ముళ్ళతో పాటు తల పండిన పొలిటికల్ పండిట్స్ కూడా చెబుతున్నారు. డిల్లీ గద్దెని ఎదిరించి నిలిచిన అన్న గారికి అసలైన వారసుడు జగన్ అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో


మరింత సమాచారం తెలుసుకోండి: